‘మెల్ బోర్న్ బతుకమ్మ’ ఆధ్వర్యంలో మిన్నంటిన సంబరాలు!

బతుకమ్మ.. ఇప్పుడిదొక తెలంగాణ బ్రాండ్ ఇమేజ్. తెలంగాణ లో నే కాకుండా ప్రపంచం మొత్తంమీద జరుపుకునే అతి పెద్ద పూలపండగ. దేశవిదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారు. తాజాగా ‘మెల్ బోర్న్ బతుకమ్మ’ ఆధ్వర్యంలో శనివారం రాక్ బాంక్ లో గల మురుగన్ టెంపుల్ ఆవరణలో చాల ఘనంగా నిర్వహించారు. ఊరి వాతావరణం ఉట్టిపడేలా దాదాపు 500 కు పైగా కుటుంబ సభ్యుల మధ్య ఆట పాటలతో ఉల్లాసంగా పండుగ చేసుకున్నారు.

2008 నుండే మెల్ బోర్న్ లో లోకల్ పార్క్ లో జరుపుతూ వస్తున్నా ఈసారి గుడిలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు చెప్పారు. వివిద ప్రాంతాల నుండి తెలంగాణ సాంప్రదాయ దుస్తులు ధరించి పిల్లలు పెద్దలు అధికసంఖ్యలో పాల్గొని ప్రతి సంవత్సరం కలిసి సంబరాలు చేసుకోవడం ఇక్కడ ఆనవాయితి గా మారిందని పలు ఇతర భారతీయ సంస్థలు తోడుగా నిలుస్తున్నందుకు సంతోషం అని ఈసంవత్సరం ఉత్సవములో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో తెలంగాణ జాగృతి, తెరాస ఆస్ట్రేలియా శాఖ సభ్యులు హాజరయి శుభాకాంక్షలు తెలిపారు.

 

 

Facebook Comments

Leave a Comment