వ్యవ’సాయం’ పెరిగేనా.. రైతుకు ఆదాయం చేకూరేనా..!

Phot Credits: Subhendu Bagchi

వ్యవసాయానికి ప్రధాన వనరులైన సాగునీరు, సాగు భూమి కొరత మూడో ప్రతికూల అంశం. పెరుగుతున్న జనాభాతో భూకమతాల పరిమాణం తగ్గిపోతుంది. నిరుడు భారత్ నుండి ఎగుమతైన ఆహార ఉత్పత్తుల్లో వాడిన నీరు 25 క్యూబిక్ మీటర్లు. అంటే ఒక ఏడాదిలో దేశంలో అందుబాటులో ఉన్న నీటిలో ఒక శాతం. ఇది తిరిగి పొందరానిది. ఈ మేరకు నీటిని పొందడానికి అయ్యే ఖర్చు ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం కంటే ఎక్కువేనని గణాంకాలు చెబుతున్నాయి.

మన దేశంలోని భూముల్లో సూక్ష్మధాతు పోషకాలైన బొరాన్, జింక్, ఇనుము ఎక్కువ మొత్తంలో లోపించిన ఫలితంగా పంటల దిగుబడులు తగ్గిపోయాయి. 2022 నాటికి భారతీయ రైతుల యొక్క ఆదాయాలు రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం అశోక్ దల్వాయి సారధ్యంలో తొమ్మిది మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. భారత వ్యవసాయం – హరిత విప్లవం వంటివి ప్రస్తుత దేశ వ్యవసాయ పరిస్థితిని కళ్ల ముందు ఉంచింది. అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులతో భూముల ఉత్పాదకత పెరిగింది. అయితే భూగర్భ జలమట్టాలు అడుగంటాయి. 2022 నాటికి లక్ష్యం చేరాలంటే రైతుల ఆదాయంలో 12శాతం వృద్ధి కనిపించాలి. కానీ, 2003 నుంచి 2013 వరకు భారత రైతు ఆదాయంలో వృద్ధిరేటు సరాసరి అయిన ఐదు శాతం మించలేదు. రెండు కరువు పరిస్థితుల్లో చోటుచేసుకున్న వృద్ధిరేటు ఒక్క శాతంకన్నా తక్కువే.

రైతుల ఆదాయం పెరగాలంటే ముఖ్యంగా రెండు అంశాలపై దృష్టి పెట్టాలి. రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలి. సుస్థిర వ్యవసాయంపై పట్టు ఉండాలి. ఇది సాద్యమైనప్పుడే వ్యవసాయ ఉత్పత్తులతో పాటు రైతుకూ ఆదాయం చేకూరుతుంది.

-శ్రీనివాస్ చిరిపోతుల

Facebook Comments

Leave a Comment