Ganesha’s Diary Part VI (బొజ్జ గణపయ్య భూలోకయాత్ర-6)


Ganesha’s Diary Part VI
(బొజ్జ గణపయ్య భూలోకయాత్ర-6!)

“జై బోలో గణేష్ మహారాజ్ కీ.. జై..!”

డప్పుల చప్పుళ్లతో భక్తుల డాన్సులతో.. పిల్లల కేరింతలతో.. సన్నటి వానలో అందరితో పాటు గణేశుడు కూడా మైమరచి ఆడి ఆడి నిద్రపోయాడు.

పూజారి గంట కొట్టి హారతి ఇచ్చే టైం కి మెలుకువ వచ్చింది. భక్తులందరూ ఎదురుగా ఉన్నారు. పక్కనే మూషికుడు ఎందుకో అటు ఇటు తిరుగుతున్నాడు. తను చూడగానే వచ్చి పక్కన డల్ గా కూర్చున్నాడు.

మూషికుడి కు తెలుసు మూర్తిలో చేరితే పూజ అయిపోయి ప్రసాదం పంచే వరకు అందులోనే ఉంటాడు గణేశుడని. అందుకే డల్ అయిపోయి మౌనంగా కుర్చున్నాడని గమనించాడు గణేష్.

తీర్థ ప్రసాదాలు అవగానే ఒక్కొక్కరు వచ్చి దండం పెట్టుకుంటూ కోరికలు కోరడం మొదలు పెట్టారు.

“స్వామి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. మంచి లాభాలు రావాలి.. ఆలా జరిగితే వచ్చే సంవత్సరం నేనే విగ్రహం డొనేట్ చేస్తాను.”

ఇంతలో ఇంకో భక్తుడు వచ్చి “స్వామి మంచి సంబంధం వచ్చి బిడ్డ పెళ్లి జరగాలి.. ఏ ఆటంకం లేకుండా అన్నీ సర్దుబాటు కావాలి”.

“స్వామీ మా ప్రేమకు మీరే సాక్షం, గురువు గైడ్ అన్నీ నెక్స్ట్ ఇయర్ వరకల్లా మేము ఇద్దరం ఒకటై మా ఇంట్లో ఇద్దరం కలిసే గణేష్ పూజ చేసుకోవాలి.”

****

భీం రావ్ హుస్సేన్ సాగర్ లో ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. నీళ్లలో వెతికి వెతికి ఇక దొరక్కపోవచ్చు అనుకుంటుండగా కొన్ని శిధిలాల మధ్య కనిపించింది సీసా. హమ్మయ్య అనుకుని దగ్గరికి వెళ్లాడు.

మస్తాన్ చూసి ఆశ్చర్యపోయాడు.

“నువ్వు నువ్వు.. నేను చనిపోయే టైములో కనిపించావు కదా” అన్నాడు

“అవును నువ్వు మాకేదే చెప్పినవ్ అనుకుని వాళ్లు మమ్మల్ని చంపేశారు” బాధతో చెప్పాడు భీంరావ్..

“అయ్యో దుర్మార్గులు మిమ్మల్ని కూడా చంపేసారా?”

“అవును కోన ఊపిరితో ఉన్న నిన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసి ఇంటికే వెళ్ళగానే మా పైన కూడా దాడి జరిగింది. నేను తిరిగి హాస్పిటల్ కి వెళ్ళగానే నీ ప్రాణం తీసి ఈ బాటిల్ లో పెట్టి నీళ్లల్లో పడెయ్యడం చూసాను నేను.”

బాటిల్ మూత ఓపెన్ చేయడం సాద్యం కాకపోవడంతో భీం రావ్ కి ఎం చేయాలో తోచలేదు.

“సరే ఇంతకీ ఎం జరిగిందో చెప్పు. అసలు ఎందుకు మనల్ని చంపేశారు?

“నేనొక పోలీస్ ఇంఫార్మర్ ని.. వినాయక చవితి నుండి మొదలై నిమజ్జనం వరకు దేశం మొత్తంలో అల్లర్లు కావాలని ప్లాన్ చేశారు. కొంతమంది పోలీస్ వర్గాలను కొనేశారు. ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ నిరూప్ ‘మహా గణపతి’ భక్తుడని ఎలాంటి ప్రలోభాలకు లొంగడని ముందే తెలుసు కాబట్టి బెదిరించి ప్రాణ భయంతో 3రోజులు ఇంట్లోనే ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అని అనుకుని బెదిరింపు కాల్స్ ఇచ్చారు రిజైన్ చేయమని. నిజంగానే భయపడి లీవ్ పెడితే ఆ స్థానంలో వాళ్లకు అనుకూలంగా ఉన్న అతన్ని పెట్టుకుంటే వారి పని ఈజీ గా అవుతుందని అనుకుంటుండగా నేను విన్నాను”.

“ఎవరు వాళ్ళు ఎం ప్లాన్ ఉండే?”. ఆతృతగా అడిగాడు భీంరావ్.

“ఏమో తెలియదు కానీ విగ్రహాలను లారీలల్లో తరలించే సమయంలోనే ప్లాన్ చేయాలన్నారు. భారీ యెత్తున పేలుడు పదార్థాలు కూడా వారిదగ్గర ఉన్నాయి. మొదట పేలుళ్లు తర్వాత హిందూ ముస్లిం కొట్లాటలు ప్లాన్ చేస్తున్నారు. తీవ్రవాదుల్లో మాలాంటి పోలీస్ ఇన్ఫార్మర్ ఉన్నట్టే పోలీస్ డిపార్ట్మెంట్ లోనే తీవ్రవాదులు కలిసి పనిచేస్తున్నారు. యే గ్రూప్ లో ఎవరు బయటపడ్డ అంతం అవ్వాల్సిందే. నా గురించి తెలియగానే ఎటాక్ చేసారు”.

“హిందువులపైన ఇంత కోపమా?”

“కాదు.. ఇది హిందువులపై కోపం కాదు. ఇందులో అన్ని మతాల వారు ఉన్నారు. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉంది ఈ తీవ్రవాద సమస్య. ఎక్కడ యే అవకాశం ఉన్నా వాడుకుంటారు. అస్సలు దాని ద్వారా ఎం వస్తుందో తెలియదు. వాళ్ళ మతాలు, పేర్లు అవసరాన్ని బట్టి మారుతూనే ఉంటాయి. నా బాధ నేను చనిపోయినందుకు కాదు ఎలాంటి విపత్తు జరగొద్దని.”

వెంటనే ఈ విషయాలన్నీ నిరూప్ కి చెప్పాలని అనుకున్నాడు. మస్తాన్ కి ‘కిష్కిరి లోకం’ గురించి వివరించి అక్కడికి వెళ్లి మస్తాన్ ని కూడా విడిపించే ప్రయత్నం చేస్తానని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చాడు భీంరావ్.

కిష్కిరి లోకం వెళ్లిన తర్వాత మళ్లీ అవకాశం వస్తుందో లేదో ఎందుకైనా మంచిది ఒకసారి పక్కనే ఉన్న ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం చేసుకొని వెళదాం అనుకుని బయలుదేరాడు.

***

మానవ రూపంలో గణేష్, మూషికుడు బయటకి వచ్చారు.

“మూషికా! ఏంటి ఏమీ మాట్లాడట్లేదు. చాలా డల్ గా కనిపిస్తున్నావ్ పోద్దటినుండి”

“ఎం చెయ్యమంటారు అంతా మీవల్లనే”

“నా వల్లనా ఎం జరిగింది?”

“ఎం జరిగింది అంటే నేనేం చెప్పను?!!.. భక్తుల సేవలతో మిమ్మల్ని మీరే మై మరచి పోయారు. చూడు మూషికా చూడు.. ఇక్కడ డెకొరేషన్ అదిరింది.. ఇక్కడ చూడు బాహుబలి వినాయకుడు.. అదిగో సిక్స్ ప్యాక్ వినాయకుడు.. అదిగో కంప్యూటర్ వినాయకుడు…అంటూ పొంగిపోయారు.. నాకూ చాలా సంతోషంగానే ఉంది కానీ..”

“మూషికా అసలు విషయం చెప్పు”

ఒకదగ్గర “ఎంత పెద్ద మండపమో చూడు” అన్నారు. నేను సూపర్ మండపం చాలా పెద్దది అని పైకి చూసాను అంతే ‘చంద్రుడు’ కనిపించాడు. ఇప్పుడేం ‘అపనింద’ పడుతుందో ఏమో.. అంతా మీవల్లనే!”

“హ హా హ..ఆ..” గట్టిగా నవ్వాడు గణేష్. “పద ముందు ఫోన్ తీసుకుందాం.”

“ఇద్దరు దగ్గర్లో ఉన్న మొబైల్ షాప్ కి వెళ్లారు.”

షాప్ లో నచ్చిన ఫోన్ సెలెక్ట్ చేసుకుని దానితో పాటు సింకార్డు లు ఇవ్వమన్నాడు. షాప్ యజమాని ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు.

మూషికుడు షాప్ యజమానితో..
“ఏందీ.. ఎం మాట్లాడుతున్నావ్ ? అందరికి ఆయనే ‘ఆధారం’..అలాంటిది ఆయన్నే ఆధార్ కార్డు అని అడుగుతావా?”

ఇంతలో పక్కనే ఉన్న ఒకాయన వచ్చి “అన్నా ఆగు.. జరాగు..ఆధార్ కార్డుందా? అని అడిగాడు.

“లేదు” అన్నట్టు తలూపాడు అడ్డంగా..

“ఇగో అన్నా.. మీ అన్న ఊర్లో పెద్ద ‘తోపు’ అయిఉండొచ్చు.. ఇక్కడ మాత్రం ఆధార్ కావాలి. సరే పైసలున్నాయా? అని పక్కకు తీసుక పోయి అడిగాడు.

“అంటే డబ్బుంటే ఇచ్చేస్తారా”

“యే.. ఒక ఐదు వందలు కొట్టు.. నేను చూసుకుంటా..మన హైద్రాబాదుల పైసలుంటే సాలు అన్ని దొరుకుతాయి”

సరే అని డబ్బులు ఇచ్చాడు మూషికుడు.

“ఎం పేరు నీపేరు”

“మూషికా”

“ఏందీ మూషికా నా? గదేం పేరు? మూషిక్ బాబు అని పెట్టుకో లేదా మూషిక్ శర్మ అని పెట్టుకో.. వద్దులే నీకు సూట్ కాదు.. ఓ పని చెయ్యి ‘మూషిక్ రెడ్డి’ అని పెట్టుకో ఈమధ్య ‘అర్జున్ రెడ్డి’ సిన్మా బాగా పాపులర్ అయ్యింది కదా.”

కొత్త వాళ్ళను చులకనగా మాట్లాడడం కొంతమందికి అలవాటే. నగరంలో ఎంత పోష్ గా కనిపిస్తే అంత గౌరవం ఇస్తారు. కోటీశ్వరుడు ఎలాంటి పేరు పెట్టుకున్నా పర్వాలేదు. ఇలాంటి వాళ్ళు ఎదురైనా ఎలాంటి అనవసరపు గొడవలు పెట్టుకోవద్దని గణేష్ అల్రెడ్ చెప్పాడు అందుకో మూషికుడు ఊరుకున్నాడు.

ఫోన్ బిల్లింగ్ చేసి వారి పేర్లు రాసుకున్నాడు యజమాని గణేష్, ముషిక్ అని.

“స్వామీ ఇప్పటినుండి నన్ను మూషిక్ అని పిలువండి. మూషికా అంటే ఎదో నామోషీ గా ఉంది”.

“అలాగే మూషిక్” నవ్వుతూ అన్నాడు గణేష్. ఇద్దరు రైల్వే స్టేషన్ వైవు నడిచారు.

****

హిమాలయాల్లో పడిపోయిన ప్రేతాత్మ మెలకువ రావడంతో లేచి ఎం జరిగిందా అని గుర్తు తెచ్చుకున్నాడు. నిరూప్ ఆత్మ ఉన్న సీసా లోయలో పడ్డ సంగతి గుర్తుకు వచ్చి అది వెదకడం ప్రారంభించాడు. వెతుకుతూ ఒకచోట ఉన్న ఆశ్రమంలో అది పడిపోయిందని గుర్తించాడు. అయితే ఆశ్రమం లోనికి వెళ్లలేక పోయాడు. దీంతో కోపంతో అక్కడ ఉన్న చెట్లను ఊపి గాలితో అక్కడ ఉన్న గృహాలని చిన్నాభిన్నం చేశాడు. అక్కడ ఉన్న స్త్రీలు పిల్లలు భయంతో వణికి పోయారు. ఎంత ప్రయత్నం చేసినా కాంపౌండ్ లోపలి మాత్రం వెళ్లలేక పోయాడు.

మారువేషం వేసుకుని అటుగా వస్తున్న ముని కుమారులను అడిగాడు “ఇది ఎవరి ఆశ్రమం” అని.

ఇది ‘మహా కపిలాశ్రమం’ అని వారి గురువు ‘ఏకాంతుడని’ చెప్పారు.

మారు వేషంలో ఉన్న ప్రేతాత్మ తనని తాను ‘విసురుడు’ అని.. కొన్నేళ్లుగా హిమాలయాల్లోనే తపస్సు చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. తన దగ్గరికి ఇద్దరు భార్య భర్తలు వచ్చి వారిని ఒక ప్రేతాత్మ హింసిస్తోందని చెపితే దానిని బందించి తీసుకు వెళ్తుండగా అది జారిపోయి మీ ఆశ్రమంలో పడింది. అందుకే అక్కడ గాలి బాగా వీచి చిన్నాభిన్నం చేస్తుంది అని చెప్పాడు.

“మీరు వెదికి అది తీసుకొస్తే వెళ్ళిపోతాను. దానిని పాతాళంలో లోకి పంపించేంతవరకు నాకు నిద్దుర లేదు..అని చెప్పాడు.

“స్వామి మాతో పాటే రండి స్వయంగా మీరే తీసుకుపోదురు గాని” అన్నాడు ఓ ముని కుమారుడు.

“లేదు నేను ఆశ్రమంలో అడుగు పెట్టకూడదు. ఒకసారి ఆత్మను బంధించిన తరువాత దాన్ని భూస్తాపితం చేసి స్నానం చేస్తే గాని ఆశ్రమంలో అడుగు పెట్టరాదు అని నమ్మబలికాడు.

ఇద్దరిని తన దగ్గర మాట్లాడడానికి ఉండమని మిగితా వారిని వెళ్లి తీసుకురమ్మన్నాడు.

“సరే అయితే మేమే తీసుకువస్తాం” అని వాళ్లు లోనికి వెళ్లారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన రెండు కుక్కలు విసురుడిని చూసి మొరగడం ప్రారంభించాయి. ముని కుమారులు ఎంత వారించినా అవి వినకపోగా ఇంకా ఎక్కువగా మొరుగుతూ ముని వేషంలో లో ఉన్న విసురుడి మీదకు దూకాయి. వాటి అరుపులకు ఆశ్రమం నుండి అందరు వచ్చి చూడసాగారు. సహనం కోల్పయిన విసురుడు తన అసలు వికృత రూపం దాల్చి వాటిని బంధించాడు. ముని కుమారులను కూడా బందించి త్వరగా ఆత్మ ఉన్న సీసా తీసుకు వస్తే వీరిని వొదిలి పెడతానని చెప్పి పక్కనే ఉన్న మర్రిచెట్టు మీదకు ముని కుమారులను తీసుకుని వెళ్ళిపోయాడు.

(ఇంకా ఉంది)

Click here for part V

Click here for part IV

Click here for part III

Click here for part II

Click here for part I

-అక్షర్ సాహి
aksharsahi@gmail.com

Facebook Comments

Leave a Comment