‘వాలుజడ’ ఫస్ట్ లుక్ కి రికార్డు స్పందన


నటి ధన్సిక గుర్తుందా? అదేనండీ మన తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ సినిమా ఉండే కదా ‘కబాలి’.. అందులో రజని కూతురు గా నటించి లుక్స్ లోను నటన లో మంచి మార్కులు కొట్టేసి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

ఇప్పుడు వాలుజడ అనే తెలుగు సినిమాతో మరోసారి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. తాజా గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని అగ్ర తార కాజోల్ చేతుల మీదుగా విడుదల చేయించారు. సినిమా టైటిల్ ని మెప్పించేలా పొడవాటి వాలుజడ తో ఉన్న పోస్టర్ లు తమిళ, తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ర‌మ‌ణ మ‌ల్లం ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి ధన్సిక కు జోడిగా నివిన్ పౌలీ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సింహ వాహిని చలన చిత్రం, సాయి వైభవి స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో నిర్మిస్తున్నాయి.

Facebook Comments

Leave a Comment