వినాయక చవితి కానుకగా ‘లవ’ టీజర్.

బాబీ డైరెక్షన్ లో ఎన్టీర్ నటిస్తున్న చిత్రం జై లవ కుశ. చిత్ర బృందం వినాయక చవితి కానుకగా ఇంకో టీజర్ ను అందించింది. తొలిసారి ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే క్యారెక్టర్లలో త్రిపాత్రాభినయనం చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈచిత్రం సెప్టెంబర్ 21 న విడుదల కు రెడీ అవుతోంది. రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.సెప్టెంబ‌ర్ 3న పాటలు రిలీజ్ కానున్నాయి.

Facebook Comments

Leave a Comment