యుద్ధం శ‌ర‌ణం! ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మ‌ధ్య సాంగ్ విడుద‌ల

నాగ చైతన్య లేటెస్ట్ మూవీ యుద్ధం శ‌ర‌ణం సెప్టెంబర్ 8న రిలీజ్ కాబోతుంది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించ‌గా, సీనియర్ నటుడు శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్ గా చేశాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

ఈమద్యే రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటలను మొత్తం ఒకేసేసారి కాకుండా ఒక్కొక్కటి లాంచ్ చేస్తూ ఆసక్తి ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శ్రేయాస్‌ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల మధ్య ‘ఆవేశం నిన్నే ప్రాణం తీసేయ్ అంటుంటే.. చేసేయ్ సాహ‌సం’ పాట‌ను విడుద‌ల చేశారు. కృష్ణ ఆర్వి ముత్తు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు బానే ఉన్నాయి.

Facebook Comments

Leave a Comment