200 రూపాయల కొత్త నోటు వచ్చేసిందోచ్.


2000 రూపాయల నోటు వచ్చినంక చిల్లర సమస్య సమస్య బాగా ఎక్కువయ్యింది. అసలే ఎటిఎం లల్ల పైసల్ లేవంటే వచ్చిన 2000 లకు చిల్లర దొరుకుడు తలకాయనిప్పి అయ్యింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 100 నోట్లు సరిపోవని 200 ల నోటు అయితే మంచిగుంటదని ఆర్బీఐ డైరెక్టర్ బోర్డు లో పెద్దలు డిసైడ్ చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఆ నోట్లు మార్కెట్ లో రిలీజ్ కానున్నాయి. ఆర్బీఐ ఆఫీసుల్లో, కొన్ని సెలెక్టెడ్ బ్యాంకుల్లోనే 25నుండి అందుబాటులోకి వస్తున్నాయి.

మైసూర్ గవర్నమెంట్ కొత్త ప్రెస్ లో ప్రింట్ చేశారట. నోటు ఫ్రంట్ సైడ్ గాంధీ తాత, రైట్ సైడ్ అశోక స్థూపం, ఇక మన దేశ సాంస్కృతిక, వారసత్వ సంపద ఉట్టిపడేలా బ్యాక్ సైడ్ సాంచీ స్థూపాన్ని ముద్రించారు. ఎల్లో కలర్ లో ఉన్న ఈ నోటుతో రేపటినుండి చిల్లర కష్టాలకు తెర దించుతారో చూద్దాం మరి.

Facebook Comments

Leave a Comment