ఇద్దరు సీఎంలు, మధ్యలో పవన్.. ఆసక్తి రేపిన గవర్నర్ ఎట్ హోం!

Photosource:NTNews

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకున్నారు. నేతలు, ఇతర ప్రముఖులు వేసిన జోకులకు నవ్వుకున్నారు. ఈ అరుదైన సన్నివేశం స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమంలో కనువిందు చేసింది. ఏటా ఇండిపెండెన్స్ డే నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎట్ హోం పేరిట తేనేటి విందు ఇవ్వడం ఆనవాయితీ.

ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. వారికి గవర్నర్ స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకువచ్చారు. ఇద్దరు సీఎంలు ప్రముఖులను కలుసుకుని సందడి చేశారు. ఈ ప్రోగ్రామ్ లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంల మధ్య ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన చట్టంలోని సమస్యలపై గవర్నర్ తో చర్చించారు.

మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా రెండు గంటలపాటు ఇద్దరు చంద్రులతో నరసింహుడి త్రైపాక్షిక చర్చలు! గవర్నర్ తో దాదాపు 2 గంటల పాటు చర్చించిన కేసీఆర్, చంద్రబాబు నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావించినట్లు సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంపై మరోసారి ఒత్తిడి తెస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయం వీరి మధ్య వ్యక్తమైనట్లు తెలిసింది. అలాగేభూసేకరణ, ఎగువ రాష్ట్రాల నుంచి నీటిపైనా, జీఎస్టీ ప్రభావం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ కూడా గవర్నర్ తో ప్రత్యేకంగా భేటీ అవడం హాట్ టాపిక్ అయింది. అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌. ఈ నేపథ్యంలో పవన్‌కు రాజ్‌భవన్‌ నుంచి మొదటిసారిగా పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, కేంద్ర, రాష్ట్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అతిథులందరికీ గవర్నర్ దంపతులు సాదరస్వాగతం పలికారు.

Facebook Comments

Leave a Comment