పదవిని వదులుకోబోతున్న బ్రిటన్ రాణి.. బట్ నాట్ నౌ!

Photo Source: Toronto Star

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-II తన పదవీత్యాగానికి సిద్దమైనట్లు తెసుస్తోంది. తాను పదవి నుంచి దిగిపోయి.. ఆ బాధ్యతలను తన పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కు అప్పగించాలని భావిస్తున్నట్లు రాజమహల్ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. 1953లో ఎలిజబెత్ పట్టాభిశిక్తురారైలన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతున్నారు. అలాగే ఎలిజబెత్ సుదీర్ఘకాలంపాటు పాలించిన బ్రిటీష్ చక్రవర్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

ప్రస్తుతం క్వీన్ ఎలిజబెత్-II వయసు 92 ఏళ్లు. అయితే త్వరలోనే పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌కు పట్టాభిషేకం చేయాలని ఆమె నిర్ణయించినట్టు చర్చ సాగుతోంది. అయితే అయితే ఇందుకోసం మరో మూడేళ్లు సమయం పడుతుందని సమాచారం. ప్రస్తుతం క్వీన్ ఎలిజబెత్-II వయసు 92 ఏళ్లు కాగా మరో మూడేళ్లు అంటే ఆమెకు 95 ఏళ్లు వచ్చాక ప్రిన్స్ చార్లెస్ పూర్తిస్థాయిలో పగ్గాలు స్వీకరించనున్నట్లు సమాచారం.

కాగా, వయోభారంతో బాధపడుతున్న క్వీన్ ఎలిజబెత్ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతోంది. అమె తరపున ప్రిన్స్ చార్లెస్‌ చిన్న కుమారుడైన వేల్స్ హ్యారీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కామన్‌వెల్త్ దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో పర్యటించారు. అంతకుముందు కెనడా కూడా సందర్శించారు. అయితే తరచుగా ఆయా అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్న వేల్స్ హ్యారీనే పర్షియన్ గల్ఫ్ అధికారికంగానే రాజుగా గుర్తించింది. రాజమహాల్ లో జరుగుతున్న చర్చ ప్రకారం పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కు పట్టాభిషేకం చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ఆధిపత్యం ఎవరికి వెళ్తుందనేది ఆసక్తిగా మారింది.

Facebook Comments

Leave a Comment