గోల్కొండ కోటపై అంబరానంటిన సాంస్కృతిక సంబురాలు..

71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటపై ఘనంగా జరిగాయి. కోట చరిత్రకు జీవం పోసేలా రాష్ట్ర సాంస్కృతిక శాఖ పలు కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ కళారూపాలను నిపుణులైన కళాకారులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో తెలంగాణ సంబురాలు అంబరాన్ని అంటాయి.

ఒగ్గుడోళ్లు, డప్పులు, చిందు యక్షగానం, దాండియా, భాంగ్రా, గుస్సాడి, రాజన్నడోలు, లంబాడా, కొమ్ముకోయ, రాజకోయ, నగారాలు, కొమ్ములు, రాజస్థానీ, మాధురి, అల్ఫా, గుజ్రా, కవ్వాలీ, పేరిణీ, లాస్యం, కూచిపూడి, పన్నెండు మెట్ల కిన్నెర తదితర అన్ని రకాల కళారూపాలూ ఒక్కసారిగా మిన్నుముట్టేలా సంబురాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు.

ఒక్కో కళారూపాన్నీ జెయింట్ స్క్రీన్స్ పై కెమెరాలు చూపిస్తున్న వేళ, దాదాపు 1000 మంది కళాకారులు చేసిన ప్రదర్శన నభూతో నభవిష్యతిగా నిలిచింది. ముందస్తుగా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ వెల్లడించిన మేరకు కార్యక్రమాలను అదరగొట్టింది సాంస్కృతిక శాఖ.

Facebook Comments

Leave a Comment