9 నెలల్లో శుక్రగ్రహానికి చేరినవాళ్లం.. 70 కి.మీ రైల్వేలైన్ కు 42ఏళ్లు పట్టింది :ప్రధాని

Photosource: The Indianexpress

భారత శక్తి సామర్థ్యాలేంటో శత్రుదేశాలకు తెలిసిందని.. పాకిస్థాన్ ప్రాంతంలో ఒక్కసారి చేసిన లక్షిత దాడులతో ఈ విషయం ప్రపంచానికి స్ఫష్టమైందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ..భారత సైన్యంలోని ఏ విభాగంలో ఉన్న సైనికుడైనా… ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా జాతి సేవలో నిమగ్నమై ఉన్నారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ నిత్యమూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న జమ్మూ కశ్మీర్‌ సమస్యకు బుల్లెట్లు, దూషణలతో పరిష్కారం దొరకదని,కేవలం ప్రేమను పంచడం ద్వారా మాత్రమే జమ్మూ కశ్మీర్ సమస్యను పరిష్కరించగలమన్నారు.125 కోట్ల మంది భారతీయులందరం ఒక్కటై కొత్త సంకల్పంతో ఏదైనా సాధించగలమన్నారు. ఎప్పటికీ దేశ భద్రతే మా తొలిప్రాధాన్యమని వెల్లడించారు. ఈ దేశం నిజాయతీపరులది. ఇందులో అక్రమార్కులకు చోటు లేదు. బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చి రూ.800కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. సముద్రం, సరిహద్దు, సైబర్‌.. ఏ విషయంలోనైనా రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

అన్నదాతలకు వెన్నుతట్టి ప్రోత్సహించడం, అప్పుల్లో కూరుకుపోయిన రైతన్నకు చేయి అందించే కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. యువతకు చేయూతనందిస్తే అద్బుతాలు సృష్టిస్తారు. ముద్ర యోజన ద్వారా అనేక మంది యువత కొత్త ఉద్యోగాలు సృష్టించారు. అందుకు ఇదే నిదర్శనమన్నారు. దేశంలో వేగవంతమైన చర్యలకు శ్రీకారం చుడుతున్నాం. 9 నెలల్లో శుక్రగ్రహానికి చేరినవాళ్లం.. 70 కిలోమీటర్ల రైల్వేలైన్‌ వేయడానికి 42ఏళ్లు పట్టింది. ఇలాంటి పరిస్థితులు మార్చాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.

Facebook Comments

Leave a Comment