చరిత్రలో నిలిచేలా ఇండిపెండెన్స్ డే ‘గిఫ్ట్’ ఇచ్చిన కోహ్లీ సేన

స్వదేశంలో ప్రజలంతా స్వాతంత్య్ర వేడుకలకు అంతా సిద్దం చేసుకుంటున్న సమయంలో విదేశీ గడ్డపై టీమిండియా ఓ అద్బుతమైన బహుమతిని సాధించిపెట్టింది. చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖిస్తూ చేసిన అద్బుతంతో 71వ ఇండిపెండెన్స్ డే వేడుకలు మరింత పండగ వాతావరణం సంతరించుకున్నాయి. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ విజృంభించి..85 ఏళ్ల మన టెస్టు చరిత్రలో మునుపెవరికీ సాథ్యంకాని ఘనతను కోహ్లీసేన అలవోకగా అందుకుంది.

టెస్ట్ మ్యాస్టుల్లో తమకెవరూ సాటిరారని మరో సారి టీమిండియా నిరూపించింది. సమిష్టి కృషితో…అసాధారణ ఆటతో చెలరేగిపోయిన టీమిండియా.. శ్రీలంకను వారి సొంతగడ్డపై వైట్‌వాష్‌ చేసింది. పల్లెకెలె వేదికగా జరిగిన మూడో మ్యాచ్ ను మూడు రోజుల్లోనే ముగించేసింది. దీంతో 3-0తో కోహ్లీ సేన..విదేశీ గడ్డపై మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది..!

ఈ సిరీస్ లో భారత ఆటగాళ్లు తమ వ్యక్తిగత కెరీర్లో పలు రికార్డులను తిరగరాశారు. ఎన్నో రోజులుగా అభిమానులు, జట్టు సభ్యుల పేస్‌ ఆల్‌రౌండర్‌ ఎదురు చూపులకు తెరదించుతూ హార్దిక్ పాండ్యా రూపంలో మరో కపిల్ దేవ్ వెలుగులోకి వచ్చాడు. ఆద్యంతం ఏకపక్షంగా కొనసాగిన టీమిండియా సీరీస్ ను లాంఛనం ముగించింది. దీంతో చరిత్రలో నిలిచిపోయే బహుమతిని ఈ ఇండిపెండెన్స్ డే కానుకగా అందించింది కోహ్లీ సేన. కాగా, ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఆదివారం జరగనుంది.

Facebook Comments

Leave a Comment