ఇంటర్నేషనల్ చైల్డ్ ఫిల్మ్ ఫెస్ట్ ఏర్పాట్లపై ఫోకస్

20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటర్నేషనల్ చైల్డ్ ఫిల్మ్ ఫెస్ట్ హైదరాబాద్‌లో నవంబరు 8 నుంచి 14 వరకు జరుగుతాయని పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ వెల్లడించారు. ఈ మేపకు ఈ ఏడాది జరగనున్న ఈ వేడుకల ఏర్పాట్లపై నవీన్‌ మిట్టల్‌ సినిమా అభివృద్ధి సంస్థ, బాలల సినిమా సొసైటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

శిల్పకళావేదికలో ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్ తెలిపారు. బాలల చిత్రాలను ప్రదర్శించేందుకు నగరంలో 12 థియేటర్లను ముందుగానే బుక్‌ చేయాలని అధికారులకు సూచించారు. పల్లల పండగగా అలరించే ఈ వేడుకలను తెలంగాణలోని 31 జిల్లాల్లో నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జవహర్‌ బాల భవన్‌లో సదస్సులు జరుగుతాయని కమిషనర్ పేర్కొన్నారు.

కాగా, దేశంలోని బాలబాలికలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాలల చిత్రాల్లోని సరికొత్త ధోరణులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకునేందుకు వీలుగా 1979లో ముంబయి నగరంలోఇంటర్నేషనల్ చైల్డ్ ఫిల్మ్ ఫెస్ట్ ను నిర్వహించారు. పది రోజులపాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు ముంబయి తరువాత చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, భువనేశ్వర్, ఢిల్లీ, త్రివేండ్రం, ఉదయ్‌పూర్, హైదరాబాద్.. నగరాలలో వరుసగా నిర్వహించారు.

అయితే హైదరాబాద్‌లో 1995లో జరిగిన ‘భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం’ ఘనవిజయం సాధించడంతో 1997వ సంవత్సరం తరువాత హైదరాబాద్ నగరాన్ని భారత అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించే శాశ్వత వేదికగా ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్నించి ప్రతి రెండేళ్లకోసారి ఈ ఉత్సవాలను నగరం వేదికగా మారింది.

Facebook Comments

Leave a Comment