జావెలిన్ త్రోలో చరిత్ర సృష్టించిన దేవేందర్ సింగ్

ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ బరిలోకి దిగిన పంజాబ్ కు చెందిన దేవేందర్ సింగ్ పురుషుల జావెలిన్ త్రోయర్ సంచలనం సృష్టించాడు. అంచనాలను తారుమారు చేస్తూ.. తన అద్బతమైన ప్రదర్శనతో ఫైనల్స్ కు అర్హత సాధించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత జావెలిన్‌ త్రోయర్‌గా చరిత్ర సృష్టించాడు.

జావెలిన్ త్రోలో ఫైనల్ చేరేందుకు క్వాలిఫికేషన్ మార్క్ 83 మీటర్లు. గ్రూప్-బి నుంచి క్వాలిఫికేషన్‌లో పోటీపడ్డ దేవేందర్ తొలి ప్రయత్నంలో 82.22 మీటర్లు త్రో చేశాడు. ఇక రెండో ప్రయత్నంలో అంతకంటే తక్కువగా 82.14 మీటర్లు త్రో చేసి న దేవేందర్ మూడో ప్రయత్నంలో మాత్రం ఏ కంగా 84.22 మీ టర్లు త్రోచేసి సఫలమయ్యా డు.

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మొదలై వారం దాటినా టోర్నీలో మనోళ్లు మెరవలేకపోయారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అందరి దృష్టి యువ సంచలనం నీరజ్‌ చోప్రాపైనే! ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ప్రపంచ రికార్డుతో పాటు స్వర్ణం ఎగరేసుకుపోయిన అతడు సీనియర్‌ విభాగంలోనూ సంచలనం సృష్టిస్తాడేమోనని అంతా ఎదురుచూశారు. కానీ ఆమేరకు రాణించలేకపోయిన అతడు అర్హత సాధించలేకపోయాడు. దీంతో క్వాలిఫయింగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టాడు. కాగా, అర్హత సాధించిన దేవేందర్ సింగ్ ఈనెల 12వ తేదీన జరగనున్న ఫైనల్స్ లో తన సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నాడు.

Facebook Comments

Leave a Comment