ఎగ్స్ అంటే వణికిపోతున్న యురోపియ‌న్లు..కారణం?


ఎగ్స్ తినాలంటే యూరప్ ప్రజలు జంకుతున్నారు. ఏదైనా చెప్పండి ఎగ్స్ మాట మాత్రం ఎత్తకండి అంటూ తమ ఫుడ్ మెనులో ఎగ్స్ ఐటెమ్స్ ను రిజెక్టు చేస్తున్నారు. యూరప్ జనాలు ఉన్నట్టుండి ఇలా ఎగ్స్ పై తిరస్కారం పెంచుకున్నారు. అయితే దానికి ఓ బలమైన కారణం ఉంది. గుడ్ల‌లో క్రిముల‌ను చంపే ఫిప్రోనిల్ ర‌సాయ‌నాన్ని గుర్తించ‌డం వ‌ల్ల ఆహార భ‌ద్ర‌తా అధికారులు వాటిని తిన‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేశారు. చికెన్ ఫామౌజ్‌ల నుంచి వ‌స్తున్న గుడ్ల వ‌ల్లే ఈ కీట‌క‌నాశిని వ్యాప్తి చెందుతున్న‌ట్లు గుర్తించారు.

సుమారు 15 యూరోప్ దేశాల్లో ల‌క్ష‌ల సంఖ్య‌లో గుడ్లు క‌లుషిత‌మైన‌ట్లు యురోపియ‌న్ యూనియ‌న్ వెల్లడించింది. అయితే నెద‌ర్లాండ్స్ దేశంలో ఉన్న పౌల్ట్రీల నుంచే క‌లుషిత గుడ్లు వ‌స్తున్న‌ట్లు మొద‌ట్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తాజాగా బ్రిట‌న్ సుమారు 10 ల‌క్ష‌ల గుడ్ల‌ను మ‌ళ్లీ వెన‌క్కి పంపించింది. కాగా, క్రిమిసంహార‌క మందు ఫిప్రోనిల్ వ‌ల్ల గుడ్లు క‌లుషిత‌మైనట్లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

ఈ మందు ప్ర‌భావం వ‌ల్ల మ‌నుషుల్లో లివ‌ర్‌, కిడ్నీ, థైరాయిడ్ కు సంబంధించిన వ్యాధులు వ‌స్తాయ‌ని అన్నారు. యూరప్‌లోని నెద‌ర్లాండ్స్‌, బెల్జియం, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ దేశాల్లో ఈ క్రిమిసంహార‌క మందు ఉన్న‌ట్లు గుర్తించినట్లు తెలిపారు.
దీంతో అక్కడి ప్రజలు గుడ్లుతో చేసిన వంటకాలంటే మాకొద్దుబాబో అంటున్నారు. ఈ దెబ్బతో పౌల్ట్రీ రంగంలో భారీ మార్పులు సంభవిచనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి యూరప్ లో నెలకొన్నప్పటికి అందుకు సంబంధించిన ప్రచార ప్రభావం మన దేశ పౌల్ట్రీ రంగంపై పడే ఛాన్స్ లేకపోలేదు.

Facebook Comments