చైతు-సమంతల వెడ్డింగ్ కార్డ్ వచ్చేసింది!

అక్కినేని నాగచైతన్య సమంతల పెళ్ళీ మ్యాటర్ మరోసారి సోషల్ మీడియాలో చర్చకెక్కింది. ఈ జోడీకి ఎంగేజ్మెంట్ కావడంతో వీరి పెళ్లిపై రకరకాల న్యూస్ బయటకు వస్తోంది. తాజాగా నాగచైతన్య, సమంతల గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. వీరి వివాహం అక్టోబరు 6న గోవాలో జరగనున్నట్లు అందుకు సంబంధించి శుభలేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చైతన్య, సమంత, వీరి కుటుంబ సభ్యుల పేర్లతో పాటు గోవా వగేటర్‌ బీచ్‌లోని ది డబ్ల్యూ హోటల్‌లో శుభకార్యం జరగనుందని ఉన్న ఈ పెళ్లిపత్రికను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే ఇది నిజమైన పెళ్లిపత్రికా? కాదా? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం సమంత రామ్‌చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’, ‘సావిత్రి’, విజయ్‌ 61వ చిత్రంలో నటిస్తుండగా.. చైతూ ‘యుద్ధం శరణం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Facebook Comments

Leave a Comment