చెప్పినట్లుగానే చైనా పరువు తీశాడు

బ్యాటిల్‌ గ్రౌండ్‌ ఏసియాలో భారత ప్రతిష్ఠ నిలబడింది. ఒలింపిక్స్‌ పతకాలతో ఇప్పటికే భారత బాక్సింగ్ స్థాయిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన విజయేందర్..ముంబయి వర్లీలోని ఎన్‌ఎస్‌సీఐ వేదికగా జరిగిన పోరులో చైనీస్‌ బాక్సర్‌ జుల్ఫికర్‌ మైమైటీయాలిను మట్టికరిపించాడు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో 96-96, 95-94, 95-94 తేడాతో జుల్ఫికర్ పై గెలుపొందాడు విజయేందర్. ప్రొ బాక్సింగ్ లో ఓటమెరుగని చైనా బాక్సింగ్ దిగ్గజాన్ని తనదైన పంచ్ లతో ఓడించాడు. దీంతో WBO ఏషియా పసిఫిక్, ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ విజయేందర్ సొంతమైంది.

విజేందర్‌, మైమైటీయాలీ ఇద్దరూ సమవుజ్జీలే. కాగా గతంలో తలపడిన ఎనిమిది బౌట్లలో విజేందర్‌ విజేతగా నిలిచాడు. ఇది 9వ విజయం.అందులో ఏడు నాకౌట్‌ విజయాలే. కెర్రీ హోప్‌తో తలపడ్డ ఫైట్‌లో నిర్ణేతలు విజేందర్‌ను ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించారు. ఇక ప్రత్రర్థి జుల్ఫికర్‌ తలపడిన 9 బౌట్లలో ఎనిమిది విజయాలు సాధించాడు. ఒకటి మాత్రం డ్రా అయింది.

కాగా ఈ మ్యాచ్ కు ముందు చైనా వస్తువుల పని పడతానన్న విజయేందర్ వ్యాఖ్యలు జోరుగా ప్రచారం అయ్యాయి. బరిలో మైమైటీయాలీని మట్టి కరిపిస్తానని విజయేందర్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే విజయేందర్ మైమైటీయాలీని చిత్తు చేసి మరోసారి తన సత్తా చాటాడు.

Facebook Comments

Leave a Comment