రెండో టెస్ట్ లో భారత్ పట్టు.. అశ్విన్ సరికొత్త రికార్డు!

Cricket – Sri Lanka v India –  REUTERS/Dinuka Liyanawatte

కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్నసెకండ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా చెలరేగిపోయింది. తొలి టెస్ట్ లో ఘన విజయం సాధించిన టీమిండియా అదే జోరును రెండో టెస్టులో కూడా కంటిన్యూ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ తొలిరోజు 344 పరుగుల చేయగా, రెండో రోజు మరో 278 పరుగులు చేసి 9 వికెట్ల నష్టానికి 622 ప‌రుగుల ద‌గ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసిన భారత్ ఇప్పుడు ఆ స్కోర్‌ను అధిగమించి 622 పరుగుల దగ్గర డిక్లేర్డ్ చేసింది. దీంతో రెండో మ్యాచ్ లో కూడా భారత్ పట్టు బిగించినట్లైంది. రెండో రోజు ఆట ప్రారంభం అయిన కొద్దిసేపటికే తొలిరోజు సెంచరీతో చెలరేగిన పుజారా మరో ఐదు పరుగులు చేసి 133 పరుగుల వద్ద ఫెవిలియం చేరాడు. ఆ తర్వాత రహానే 132, ఇక రవీంద్ర జ‌డేజా 70 పరుగులతో నాటౌట్‌ గా నిలవగా సాహా 67, కేఎల్ రాహుల్ 57, అశ్విన్ 54 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

కాగా, ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 2 వేల ప‌రుగులు, 250 వికెట్లు అత్యంత వేగంగా అందుకున్న ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 2 వేల ప‌రుగులు, 250 వికెట్లు తీసుకున్న నాలుగో భార‌త ప్లేయ‌ర్‌గా అత‌డు నిలిచాడు. క‌పిల్ దేవ్‌, హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌, అనిల్ కుంబ్లే త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన నాలుగో ఇండియ‌న్ ప్లేయ‌ర్ అశ్విన్‌.

కెరీర్ లో 51వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్‌.. కెరీర్‌లో 11 హాఫ్ సెంచ‌రీలు, 4 సెంచ‌రీలు చేశాడు. అంతేకాదు వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో 2 వేల ప‌రుగులు, 200 వికెట్లు ఘనతను స్పీడ్ గా అందుకున్న వారిలో అశ్విన్ స్థానం నాలుగు. ఇయాన్ బోథ‌మ్, ఇమ్రాన్ ఖాన్‌, క‌పిల్ దేవ్ త‌ర్వాత అశ్విన్ నిలిచాడు. అయితే శ్రీలంక బౌలర్లలో హెరాత్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. పుష్పకుమార రెండు వికెట్లు తీయగా.. కరుణరత్నే, పెరీర చెరో వికెట్ తీశారు.

Facebook Comments

Leave a Comment