ప్రారంభమైన బాలయ్య 102వ సినిమా షూటింగ్


నందమూరి బాలకృష్ణ 102వ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో లాంచనంగా ప్రారంభమైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంవహిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, డైరెక్టర్ కేఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు బి. గోపాల్, క్రిష్, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ పాల్గొన్నారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101వ చిత్రం పైసా వసూల్ షూటింగ్ చివరి దశకు రావడంతో బాలయ్య తన తదుపరి చిత్రంపై ఫోకస్ చేశారు. తమిళ కమర్షియల్ డైరెక్టర్ గా వెలుగుతున్న కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే పంజాబీలో టాప్ హీరో ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా చేయబోతున్నారు. మిగతా నటీనటులను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. చిత్రానికి సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్ చేస్తుండగా.. కథ, మాటలు రత్నం, కెమెరామెన్‌గా రాం ప్రసాద్ చేస్తున్నారు.

అయితే బాలయ్య నటిస్తున్న102వ చిత్రానికి ‘రెడ్డిగారు’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ‘జయసింహ’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సింహా అనే పేరుతో వచ్చిన సినిమాలు బాలయ్య కెరీర్‌లో సూపర్ హిట్లు అవడంతో అదే సెంటిమెంట్ కంటిన్యూ అయ్యేలా ‘జయసింహా’ అనే టైటిల్ వైపే బాలయ్య మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Facebook Comments