దేశ భక్తి అంటే ఇదేనా..? ఎయిర్ పోర్ట్ లో డెఫ్‌లింపిక్స్‌ అథ్లెట్ల నిరసన!

ప్రభుత్వ తీరుకు నిరసనగా చెవిటి అథ్లెట్లు నిర‌స‌నకు దిగారు. తమపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం చెందిన అథ్లెట్లు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భైఠాయించారు. డెఫ్‌లింపిక్స్‌ 2017లో ఓ గోల్డ్ స‌హా ఐదు మెడల్స్ గెలిచిన త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంపై మండిపడ్డారు. గతంలో ఏన్నడూ లేనన్ని పతకాలు సాధించిన తమకు కనీస స్వాగతం పలికేందుకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయకపోడంపై ఇదేనా మీరు మాకిచ్చే గౌరవం అంటూ ఆవేదన చెందారు. ఇందుకు నిరసనగా తమ త‌మ మెడ‌ల్స్‌ను తిరిగి ఇచ్చేస్తామ‌ని అథ్లెట్లు వెల్లడించారు.

టర్కీలో జరిగిన డెఫ్‌లింపిక్స్‌లో పాల్గోన్న 46 మంది అథ్లెట్లు, స‌హాయ‌క బృందం ఢిల్లీ విమానాశ్రయాంలో ల్యాండ్ అయ్యారు. తాము సాధించిన విజ‌యాల‌తోపాటు ఆగ‌స్ట్ 1న తాము ఇండియా వ‌స్తున్న సంగతిని జులై 25నే చెప్పినా అధికారులకు సమాచారం అందించారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేన‌న్ని మెడ‌ల్స్ తిరిగి వస్తున్న తమకు స్వదేశంలో గౌరవ రీతిలో స్వాగతం ఉంటుందని భావించిన అథ్లెట్లకు ఊహించని పరిణామం ఎదురైంది. వారికి స్వాగతం పలకడానకి క్రీడా మంత్రి కూడా త‌మ‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డానికి రాలేద‌ని వాళ్లు వాపోయారు. క‌నీసం క్రీడామంత్రి విజ‌య్ గోయెల్‌తో ఫోన్‌లో మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నించినా.. ఆయ‌న స్పందించ‌లేద‌ని ఆరోపించారు.

ఈ విషయంపై ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ ద డెఫ్ అధికారి కేత‌న్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌, పారాలింపిక్స్ అథ్లెట్ల విజ‌యాల్ని సెల‌బ్రేట్ చేసుకునేవాళ్లు.. త‌మ ప్లేయ‌ర్స్‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిపడ్డారు. క్రీడామంత్రితోపాటు శాయ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌తో మాట్లాడానికి ప్ర‌య‌త్నించినా.. వాళ్లు స్పందించ‌డం లేదని మండిపడ్డారు.

అథ్లెట్లపట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనవసర విషయాలకు దేశ భక్తిని లంకె పెట్టే వారు.. దేశం గర్వించేలా అంతర్జాతీయ వేధికలపై సత్తా చాటివచ్చిన క్రీడాకారులకు కనీస గౌరవం ఇవ్వలేదంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

Facebook Comments

Leave a Comment