తొలి టెస్టులో భారత్ ఘన విజయం

Photof Courtesy: India Tv/AP IMAGES Ravindra Jadeja celebrates a wicket against Sri Lanka.

శ్రీలంకపై తొలి టెస్టులో భారత్ ఘన విజంయ సాధించింది. సమిష్టి కృషితో ఐదు రోజుల ఆటను నాలుగో రోజే ముగించేసింది టీమిండియా. టెస్టు ఆరంభం నుంచి లంకపై ఆధిపత్యం కొనసాగిస్తున్న భారత్ ఆతిథ్య జట్టుపై ఏకంగా 304 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో 3 టెస్టుల సిరీస్ లో భారత్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

గాలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 600 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసి లంక ముందు 550 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 76.5 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మిగిలుండగానే భారత్‌ శుభారంభం చేసింది.

కాగా రెండో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ సాధించిన కెప్టెన్ విరాట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత‌నికిది 17వ సెంచ‌రీ. అంతేకాదు కెప్టెన్‌గా అత‌నికిది ప‌దో సెంచ‌రీ. ఇప్ప‌టివ‌ర‌కు 9 సెంచ‌రీల‌తో అజారుద్దీన్ పేరిట ఉన్న రికార్డును విరాట్ అధిగ‌మించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ అందుకున్నాడు.

ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్:

శిఖర్ ధావన్ 190, అభినవ్ ముకుంద్ 12, ఛటేశ్వర్ పుజారా 153, విరాట్ కోహ్లీ 3, అజింక్యా రహానే 57, రవిచంద్రన్ అశ్విన్ 47, వృద్ధిమాన్ సాహా 16, హార్దిక్ పాండ్యా 50, రవీంద్ర జడేజా 15, మహ్మద్ షమీ 30

బౌలింగ్: ప్రదీప్ 6 వికెట్లు, కుమార 3 వికెట్లు, రంగనా హెరాత్ ఒక వికెట్

శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్:

కరుణరత్నే 2, ఉపుల్ తరంగా 64, దనుష్క గుణతిలక 16, కుసల్ మెండీస్ 0, మ్యాథ్యూస్ 83, నిరోషన్ డిక్ వెల్ల 8, దిల్రువాన్ పెరెరా 92 నాటౌట్, రంగనా హెరత్ 9, నువాన్ ప్రదీప్ 10, లహిరు కుమారా 2, అసెలా గుణరత్నే 0 రిటైర్డ్ హట్

బౌలింగ్: షమీ 2, ఉమేశ్ యాదవ్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1, రవీంద్ర జడేజా 3, హార్దిక్ పాండ్యా 1

ఇండియా సెంకడ్ ఇన్నింగ్స్ :

శిఖర్ ధావన్ 14, అభినవ్ ముకుంద్ 81, ఛటేశ్వర్ పుజారా 15, విరాట్ కోహ్లీ 103 నాటౌట్, అజింక్యా రహానే 23 నాటౌట్

బౌలింగ్(సెకండ్): పెరెరా 1, కుమార 1, గుణతిలక 1

శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్:

కరుణరత్నే 97, ఉపుల్ తరంగా 10, గుణతిలక 2, కుషల్ మెండీస్ 36, మ్యాథ్యూస్ 2, నిరోషన్ డిక్ వెల్లా 67, పెరెరా 21 నాటౌట్, నువాన్ ప్రదీప్ 0, లహిరు కుమారా 0, రంగానా హెరాత్ 0, అసెలా గుణరత్నే 0

బౌలింగ్(సెకండ్): షమీ 1, ఉమేశ్ 1, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 3

Facebook Comments

Leave a Comment