ప్రపంచకప్: టీమిండియా పై సౌతాఫ్రికా విజయం

Photo Source Reuters

ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మిథాలీ సేన జైత్రయాత్రకు బ్రేకులు పడ్డాయి. టోర్నీలో భారత్ తొలి ఓటమిని చూసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 115 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. సౌతాప్రికా నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో మిథాలీ సేన చేతులెత్తేసింది. దీంతో ప్రత్యర్థికి భారీ విజయం దక్కింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 274 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. లక్ష్య ఛేదనలో దీప్తి శర్మ (60), జులన్ గోస్వామి (43) మినహా అందరూ విఫలమయ్యారు. పిజి రౌత్ 22, మంధన 4, డిబి శర్మ 60, మిథాలీ రాజ్ 0, ఎం కౌర్ 0, వి.కృష్ణమూర్తి 3, పాండే 0, వర్మ 1, బిష్త్ 13 పరుగులకే అవుటయ్యారు.

టోర్నీ ఆరంభంలో మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న ఓపెనర్ స్మృతి మంద‌నా వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వైఫల్యాల బాట కొనసాగించింది. గోస్వామి చివరలో గట్టిగా పోరాడి 43 పరుగులు సాధించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భారత్ 46 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. కాగా సెమీస్ బెర్తు ఖాయం కావాలంటే బుధవారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ లో భారత్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. టోర్నీలో ఇది తొలి ఓటమి కావడంతో ఆస్ట్రేలియాపై మిథాలీ సేన పై చేయి సాధిస్తుందని అభిమానులు చెబుతున్నారు.

Facebook Comments