ఆసియా అథ్లెటిక్స్: తొలిరోజే భారత్ కు స్వర్ణం

Image source: The Hindu

ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో భారత్ తొలి రోజే అదరగొట్టింది. వుమెన్స్‌ షాట్‌ పుట్‌లో భారత్ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. వుమెన్స్‌ షాట్‌ పుట్‌లో మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఫలితంగా మన్‌ప్రీత్‌ కౌర్‌ స్వర్ణపతకాన్ని సాధించింది. ఇక పురుషుల షాట్‌పుట్‌లో వికాస్‌ గౌడ కాంస్య పతకాన్ని సాధించాడు.

ఒడిశాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ లో 44 దేశాలకు చెందిన 800 మందికి పైగా అగ్రశ్రేణి అథ్లెట్లు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నారు. భారత్‌ నుంచి 95 మంది అథ్లెట్లు(49 మంది పురుషులు, 46 మంది మహిళలు) ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కాగా, ఈసారి సాధ్యమైనన్ని ఎక్కువ స్వర్ణ పతకాలు సాధించే లక్ష్యంతో భారత అథ్లెట్లు రంగంలోకి దిగారు.

అనుకున్నట్లగానే తొలిరోజే స్వర్ణం సాధించి లక్ష్యం దిశగా భారత్ పయనిస్తోంది. కాగాఈ ప్రతిష్టాత్మక క్రీడలకు భారత్‌ ముచ్చటగా మూడోసారి ఆతిథ్యమిచ్చింది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Facebook Comments

1 Comment on this Post

  1. It’s amazing to visit this website and reading the views of all friends on the topic of this piece of writing, while I
    am also keen of getting familiarity. Billige Fotballdrakter

Comments have been disabled.