స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా పీవీ సింధు

భారత షటిల్ క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుకు మరో గౌరవం దక్కింది. ‘స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అందించే పురస్కారానికి ఆమె ఎంపికైంది. అలాగే సింధుకు కోచ్ గా వ్యవహరిస్తున్న గోపీచంద్ కు కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. మారుతీ సుజుకీ స్పోర్ట్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌ను గాలాలో ఆమెకు ప్రదానం చేశారు.

ఆయా విభాగాల్లో అందజేసిన ఈ అవార్డుల్లో యువ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌కు ‘గేమ్‌ ఛేంజర్‌’, 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ స్వర్ణపతక విజేత అభినవ్‌ బింద్రాకు ‘జీవిత కాల సాఫల్య పురస్కారం’, మిల్కాసింగ్‌కు ‘లెజెండ్‌’, పారాలింపిక్స్‌ పతక విజేత దీపా మాలిక్‌కు ‘స్ఫూర్తిదాయక క్రీడాకారిణి’ పురస్కారాలు దక్కాయి. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, ఫుట్‌బాల్‌ దిగ్గజం భైచుంగ్‌ భుటియా, బాక్సర్‌ ఆమిర్‌ ఖాన్‌, క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

విభాగాల వారీగా అవార్డులు దక్కించుకున్నవారు:

స్పెషల్ అవార్డు ఫర్ సర్వీస్ టూ స్పోర్ట్స్: జయంత్ రాష్టోగి, సీఈఓ మ్యాజిక్ బస్
టీం ఆఫ్ ది ఇయర్: జూనియర్ మెన్స్ హాకీ టీం
ఎడిటర్ అవార్డు ఫర్ ఎక్సలెన్సి: దేవేంద్ర ఝజ్హరియా
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టూ స్పోర్ట్స్: కె. అరుముగం
అథ్లెట్ ఆఫ్ ది ఇయర్: గురువా గిల్
గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్: కె.ఎల్ రాహుల్

Facebook Comments

1 Comment on this Post

  1. I am really enjoying the theme/design of your blog. Do you ever run into any internet browser compatibility issues?

    A handful of my blog visitors have complained
    about my site not working correctly in Explorer but looks great in Safari.
    Do you have any recommendations to help fix this issue?
    Juventus Drakt 2019

Comments have been disabled.