ఘల్లుమన్న వరంగల్.. పేరిణి నృత్య ప్రదర్శనతో కొత్త రికార్డు !

Photo Courtesy: Ntnews

పేరిణీ మహానాట్య ప్రదర్శనతో ఓరుగల్ పులకించింది. 153 మంది విద్యార్థులు రెండు గంటల పాటు చేసిన పేరిణి సృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. అలాగే ఈ మెగా పేరిణి నృత్య ప్రదర్శన భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్రాబుక్ ఆఫ్ రికార్డ్స్, యునైటెడ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం అవార్డు ప్రకటించింది

పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ 6వ వర్ధంతి వారోత్సవాల ముంగింపు సందర్భంగా హన్మకొండలోని ఇండోర్ స్టేడియంలో నటరాజ కళా కృష్ణ నృత్యజ్యోతి అకాడమీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. వరంగల్ అర్బన్, రూరల్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, సూర్యపేట జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు పేరిణి నృత్యం చేసి అందిరిని మెప్పించారు.

ఈ కార్యక్రమంలో నటరాజ కళా కృష్ణ నృత్యజ్యోతి అకాడమీ అధ్యక్షుడు గజ్జేల రంజిత్‌కుమార్ శాస్త్రి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పెరిణి రాజ్ కుమార్, శ్రీధర్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Facebook Comments

Leave a Comment