ఆసియా క్రీడల్లో ఇకపై విడియో గేమింగ్ !

ప్రపంచంలో రెండవ అతిపెద్ద మల్టీ స్పోర్ట్ ఈవెంట్ అయిన ఆసియా క్రీడల్లో ఇకపై వీడియో గేమింగ్ కూడా సందడి చేయనుంది. 2022లో జరిగే ఆసియా గేమ్ లో మీడియో గేమింగ్ ను అధికారికంగా ఆడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రతి నాలుగేళ్లకో సారి నిర్వహించే ఈ క్రీడలు వివిధ క్రీడా పోటీల వేదిక. ఆసియా ఖండానికి చెందిన దేశాల క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొంటారు. అయితే డిజిటల్ సత్తా చాటేందుకు అథ్లెట్లకు ఛాన్స్ ఇవ్వాలని ఆసియా ఒలింపిక్ మండ‌లి భావిస్తోంది. తొలుతా 2018లో ఇండోనేషియాలో జరిగే ఆసియా క్రీడల్లో ఈ వీడియో గేమింగ్ ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సాధ్యాసాధ్యాలను పరిశీలించి 2022లో చైనాలోని హంగ్‌జూలో జ‌రిగే క్రీడ‌ల్లో ఈ-స్పోర్ట్స్ కేట‌గిరీని ప్ర‌వేశ‌పెట్టేందుకు ఆసియా ఒలింపిక్ మండ‌లి యోచిస్తున్న‌ది.

Facebook Comments

Leave a Comment