“మా అబ్బాయి ” ఆడియో కి మంచి రెస్పాన్స్

ఈ మధ్యనే రిలీజ్ అయిన “మా అబ్బాయి ” ఆడియో  కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరు కొత్త టెక్నిషన్స్ అయినా ఆడియో చాల బాగా వచ్చింది. ఇటీవలి కాలంలో సినిమాలో ఒకటో రెండో పాటలు బాగున్నాయని అనిపించేది. కానీ చాలా కాలం తర్వాత సినిమాలో అన్ని పాటలు బాగున్నాయి. డైరెక్టర్ సత్తా ఏంటో ఫస్ట్ లుక్, పాటలు, ట్రైలర్స్ ని చూసి చెప్పాలంటే…  మన డైరెక్టర్ ఫుల్ మర్క్స్ కొట్టేసినట్లే. అంటే..  సినిమా మినిమం గ్యారెంటీ టాగ్ పడ్డట్టే!  అన్ని వర్గాల ప్రేక్షకులను అకార్హించేలా సాంగ్స్ ఉన్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి ఇంకో కమర్షియల్ డైరెక్టర్ వచ్చాడనే చెప్పొచ్చు.

ఇక పాటల విషయానికొస్తే,
సినిమా పేరు, ఆర్టిస్ట్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఎవరి పేర్లు తెలియకుండా పాటలు వింటే డెఫినెట్ గా ఇదేదో టాప్ హీరోలతో చేసే భారీ బడ్జెట్ మూవీ అనుకునేట్టుగా ఉన్నాయ్.ఎదో కొత్తవాళ్లతో చేసారు అన్నట్టు గా ఎక్కడా అనిపించలేదు. ఇండస్ట్రీ లో అన్ని తెలిసినవారికే అవకాశం అన్నట్లు కనిపిస్తోంది.సురేష్ బొబ్బిలి(సురేష్ యువన్) మొదటి రిలీజింగ్ మూవీ అయినా యూత్ ని ఆకట్టుకునే సాంగ్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అని ఆల్రెడీ టాక్ వచ్చింది. అన్ని యూత్ కి నచ్చిన సాంగ్స్ ఉన్నాయి. గీతరచయితల గురించి చెప్పాల్సిన పనిలేదు అందమైన పదాల అల్లికతో హృదయానికి హత్తుకునే లా ఉన్నాయి.

కదిలే కదిలే సాంగ్  హీరోయిజనాన్ని నిలబెడుతూ “ వీడు ఆరడుగుల బుల్లెట్టు” లెవెల్ లో ఉంది. “ఆ చందమామ.. ఈ నేలపై” “సాంగ్ “హాయ్ రే హాయ్ జామపండు రోయ్ “పాటను మరిపిస్తుంది. సురేష్ సాంగ్స్ లో “ప్రేమించే నాయకుడు ఇతడే “ నా ఫేవరెట్ సాంగ్స్ లో ఒకటి అయితే ఇప్పుడు “గుచ్చి- గుచ్చి చుడద్దంటే” కూడా చేర్చుకున్న. నేననుకుంటా ఇది కచ్చితంగా ఏ అర్ధరాత్రో కంపోజ్ చేసుండాలి లేదంటే మ్యూజిక్ కంపోజ్ చేసే ముందు మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహ్మాన్ తో కాఫీ తాగుతూ ఓ గంట ముచ్చట పెట్టి ఉండాలి. అంత బాగుంది సాంగ్. ఇంకో పాట “రంగాదేవ రంగాదేవ ” అయితే మనస్సును  ఊహల తీరంలోకి తీసుకుపోతుంది. “హే సాయిరాం”  పాట స్టోరీ ఏంటి అనీ ఆసక్తి కలిగిస్తుంది. ఇక మాస్ సాంగ్ విషయానికొస్తే ఇది సురేష్ కంపోజ్ చేశాడా లేక తమన్ కంపోజ్ చేశాడా అని క్విజ్ పెడితే 95% అందరు తమన్ అంటారు నోడౌట్. ఒక మిమిక్రి కళాకారుడు ఇతరుల వాయిస్ ఇమిటేట్ చేయడం ఎంత గొప్పో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ స్థాయి లో కంపోజ్ చేయడం కూడా అంతే గొప్ప.

ఓవరాల్ గా సురేష్ బొబ్బిలి గురించి చెప్పాలంటే సౌండ్ ఇంజినీర్ నుంచి ఫుల్ టైం మ్యూజిక్ కంపోజర్ గా మారడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని చెప్పొచ్చు. “పల్లె డప్పులతో పాటు పోష్  డ్రమ్స్ వరకు కాదేది మ్యూజిక్ కి అనర్హం” అని బాగా తెలిసినట్టుంది. అక్కడక్కడా తన మ్యూజిక్ లో తమన్ తొంగి చుసిన, రెహ్మాన్ ని గుర్తుచేసిన అది డైరెక్టర్ ఛాయస్ అని చెప్పాలేమో. అయితే ఎంత గొప్ప టెక్నీషియన్ అయినా సినిమా హిట్ పైనే వాళ్ళ రాతలు ఆధారపడి ఉంటాయి. రేపు విడుదలవుతున్న ఈ సినిమా లో కథ, కథనం బాగుంటే  దీనికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి ఇంకో పది సంవత్సరాల కెరీర్ కు పునాది వేసుకున్నట్లే. సురేష్ ఇలాగే తనని తాను ట్యూన్ చేసుకుంటే మన తెలంగాణ లో ఇంకో రెహమాన్ లా కీర్తి పొందగలడు. ఇది పాటలు వినగానే నాలో కలిగిన నా ఆలోచనల రిపోర్ట్.  తెలంగాణ లో అవకాశం ఇస్తే కళాకారులెందరో బయటికి వచ్చి తమ సత్తా చూపించగలరనే నమ్మకం వస్తుంది. నిజమైన టాలెంట్ ని ఎంకరేజ్ చేద్దాం.

– అక్షర్ సాహి
aksharsahi@gmail.com

Facebook Comments

Leave a Comment