మరుగున పడుతున్న కళలకు జీవం…”కోలాటం”

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరుగున పడుతున్న కళలకు జీవం పోస్తూ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ని రూపొందిస్తున్న క్రమంలో హుమాయున్ సంఘీర్ ( రచయిత, దర్శకుడు ) కి పై డాక్యుమెంటరీ ఫిల్మ్ ని చేసే అవకాశాన్ని ఇచ్చింది. ప్రతి శనివారం ” సినివారం ” పేర తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. 04-03-2017 సినివారంలో ” కోలాటం ” ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హుమాయున్ సంఘీర్ మాట్లాడుతూ ” నాకీ అవకాశమిచ్చిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ సర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు, మరియు తెలంగాణ పండగల్లో గొప్ప శక్తి వున్న పండగ బతుకమ్మ అయితే కళల్లో కోలాటం గొప్ప రిథమ్ వున్న కళ . అలాంటిదాన్ని డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయాల్సిందిగా ఈ అవకాశమిచ్చిన telangana language and culture కి శనార్తులు ” తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ” వజ్రాలు కావాల నాయన ” హీరో అనిల్ బూరగాని, జబర్దస్త్ ఫేం కొమురం  పాల్గొని దర్శకుడు హుమాయున్ సంఘీర్ ను అభినందించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు శ్రీ మామిడి హరిక్రిష్ణ సర్ సంఘీర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Facebook Comments

Leave a Comment