ఫలితాలనివ్వని అత్యాచార నిరోధక చట్టాలు

Representative photo: rape. Courtesy Newsgraph

జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక ప్రకారం గత రెండేళ్ళలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలలో 12.4 శాతం వృద్ధి అయ్యిందన్న గణాంకాలు దిగ్భాంతి కలిగిస్తోంది. సమాజం నాగరికంగా, వైజ్ఞానికంగా, అక్షరాస్యత పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా కొందరు కలియుగ కీచకులు, దుశ్సాశనులు కిరాతకంగా, పైశాచికంగా మహిళలపై అత్యాచారాలకు తెగబడుతుండడం బాధాకరం.

గత సంవత్సరం లో పదేళ్ళ లోపు చిన్నారులపై అత్యాచారాలు అంతకు ముందు సంవత్సరం తో పోలిస్తే 24 సాతం పెరిగిందన్న సదరు నివేదిక మహిళలపై అత్యాచారాల విషయం లో ముద్దాయిలకు అసలు చట్టం పట్ల భయ భక్తులు లేవని నిర్మొహమాటంగా తేల్చి చెప్పింది. నిర్భయ, పోక్సొ వంటి లాంటి కఠిన చట్టాలు అమల్లోకి తెచ్చినా మహిళలపై నేరాలు ఏ మాత్రం తగ్గకపోగా అవి ఏటికేడాదీ పెరుగుతుండదం పై ఇటీవల జాతీయ మహిళా సాధికారిక సంస్థ, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసాయి. అత్యాచారాల కేసుల్లో ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, బీహార్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఎప్పటి వలె తొలి నాలుగు స్థానాలను పదిలపరచుకోగా ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలు 10,11 వ స్థానాలలో నిలబడి బోలెడంత అప్రధిష్టను మూటకట్టుకున్నాయి. వీటిలో అత్తింటి ఆరళ్ళు, భర్తల వలన వేధింపులు అత్యాచారాలు 29 శాతం, స్త్రీల సామూహిక వేధింపులు, అత్యాచారాలు 21.7శాతం, మహిళల కిడ్నాపింగులు 20.5శాతం, రేప్‌ కేసులు 7శా తమని ఆ నివేదిక వివరించింది మహిళలు, చిన్నారులకు మెరుగైన రక్షణ కల్పిస్తున్నామన్న ప్రభుత్వ వాగ్దానాలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి. ఎన్‌సీఆర్బీ నివేదికలో కెక్కని నేరాలు, ఘోరాలు మరెన్నో ఉంటాయి. ఉత్తర్ప్రదేశ్, చత్తీస్ గఢ్, బీహార్, హరియాణా రాష్ట్రాలలో జరిగే పరువు హత్యలు, కుల వివక్ష, పోలీస్ వ్యవస్థ అంతే భయం కారణంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళని వారి సంఖ్య ప్రతీ ఏడాది లక్షల్లో వుంటుందని జాతీయ నేర గణాంకాల బ్యూరో అంచనా వేసింది. విచ్చలివిడి తనం, విశృంఖులత్వం, సామాజిక కట్టుబాట్లకు లోబడి వుండకపోవడం, విపరీతం గా పెరుగుతున్న అనైతికత,లోపభూయిష్టమైన విద్యా విధానం, నైతిక విలువలకు త్రిలోదకాలివ్వడం, సులువుగా లభిస్తున్న శృంగార సాహిత్యం, మహిళల పట్ల గౌరవాభిమానాలు లోపించడం, ఎలాంటి నేరాలకు తెగబడినా ఏం కాదన్న భరోసా వంటివి సమాజంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచార పర్వానికి కొన్ని ముఖ్య కారణాలు..దళితులపై జరిగే నేరాల్లోనూ బాధితులు ఎక్కువగా మహిళలేనని ఎన్‌సీఆర్బీ నివేదిక ఆందోళన కలిగిస్తొంది.

నేరగాళ్లపై ఉక్కుపాదం మోపడం తోపాటు నేరాలకు మూలాలైన సామాజిక పరిస్థితుల్లో మార్పులు తీసుకువచ్చేందుకు కృషిచేయాలి. దర్యాప్తు సంస్థల పనితీరుపై సరైన పర్యవేక్షణ, కేసుల విచారణ వేగవంతం చేసేలా చూడటం, కేసుల నుంచి నిందితులు బయటపడిన సందర్భాల్లో అలా ఎందుకు జరిగిందో లోతుగా ఆరాతీసి జవాబుదారీతనాన్ని నిర్ధారించి చర్యలు తీసుకోవడం అవసరం. జిల్లాకొక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నేరం జరిగిన నెలరోజులలోపే అభియోగ ప్త్రాలను దాఖలు చేయడం, విదేశాలలో వలె మూడు నెలలలోపు అత్యవసరం గా విచారణ జరిపి నిందితులకు శిక్షలు ఖరారు చేయడం జరిగితే భవిష్యత్తులో ఇటువంటి హీనమైన దుశ్చర్యలకు ఒడిగట్టేందుకు నిందితులు వెనకాడతారు. పౌరుల్లో కూడా ఆ మేరకు చైతన్యాన్ని పెంచే కార్యక్రమాలను చేపట్టాలి. ఇందుకు ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, విద్యావ్యవస్థ తగిన కార్యాచరణను రూపొందించాలి.

Facebook Comments

1 Comment on this Post

  1. I intended to compose you the tiny remark just to thank you as before with the incredible solutions you’ve shown on this website. It’s certainly surprisingly open-handed of you to give unhampered just what many people might have distributed for an e-book to help with making some money for themselves, mostly now that you could have tried it if you ever decided. The things as well worked to be the easy way to recognize that some people have the same dreams just as my personal own to know the truth whole lot more regarding this issue. I’m sure there are many more pleasurable occasions in the future for people who take a look at your blog post.

    Reply

Leave a Comment