ప్రజారోగ్యంపై దాడి చేస్తున్న కల్తీగాళ్లు!

ఆహారపదార్ధాల కల్తీ రోజురోజుకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఈ కల్తీదారులను, కల్తీ వ్యాపారులను ఉక్కుపాదంతో అణచివేస్తాం, పిడి చట్టాన్ని అమలు చేస్తాం అంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలు గాలిమాటలుగానే మిగిలిపోతున్నాయి. ఈ కల్తీ రానురాను శృతిమించి ప్రజారోగ్యంపై దాడి చేస్తూ చివరకు మనిషి మనుగడకే ప్రమాదకరంగా సంభవించే పరిస్థితులు ఇంకెంతో దూరంలో లేవని అనిపిస్తున్నాయి. అన్ని చోట్ల ప్రస్తుతం పొగమంచులా ఈ కల్తీ విస్తరించిపోతున్నది.

ఉప్పు, పప్పు, నూనె లాంటి నిత్యావసర వస్తువులతో పాటు చిన్న పిల్లల నుండి ఎనభై ఏళ్ళ ముదుసలి వరకు తాగే పాలల్లో కల్తీ అదుపు తప్పిపోతున్నది. ముఖ్యంగా మామూలు మందులు సరే, చివరకు ప్రాణాపాయం నుంచి కాపాడే మందుల్లో కూడా ఈ కల్తీ పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. అసలు కల్తీ దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తుల నుంచే మొదలవుతుందని చెప్పవచ్చు. పంటలకు వాడుతున్న ఎరువులు, ఇతర మందుల్లోనే కల్తీ ఆరంభమై వాటి అవశేషాలు, ఆహారధాన్యాల్లోనూ, పండ్లు, కూరగాయల్లోనూ మిగిలి ఉంటున్నాయి. అవి ఆహారంగా తీసుకోవడం ద్వారా మానవ దేహాల్లోకి అవి ప్రవేశిస్తున్నాయి. పంటల కోతలకు ముందు ఆ తరువాత నిల్వలు చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా విచ్చలవిడిగా పెస్టిసైడ్స్ లను వాడుతున్నారు. కాయలను పండ్లుగా మార్చేందుకు రసాయనాలు వాడటంతో తిన్నవారికి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. మనదేశంలో ఉత్పత్తి అవుతున్న పండ్లేకాదు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పండ్లను నిల్వ చేసుకునేందుకు రకరకాల రంగులు, రసాయనాలను వాడటంతో అవి విషతుల్యంగా మారుతున్నాయి. ఇక సామాన్యుడు సైతం నిత్యం వాడే ఆకుకూరలు, టమాటా, బెండ, వంకాయ తదితర కూరగాయాల్లో పురుగుల మందుల అవశేషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి మానవ శరీరంలోకి చేరి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇక హోటళ్ళలో తయారవుతున్న తినుబండారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ తిరిగి దాన్నే వాడటం వలన వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే కొన్ని హోటళ్ళలో ఆయా యాజమానులు వాడుతున్న నిత్యావసర వస్తువులు గానీ,ఆ తరువాత కనబడేందుకు వేస్తున్న రసాయనాలతో కూడిన రంగులు కూడా ప్రజారోగ్యానికి విపరీతమైన హానిని కలగజేస్తున్నాయి.

వీటిని నియంత్రించేందుకు ఎంతమంది అధికారులున్నా, ఎన్ని చట్టాలున్నా మామూళ్ళతోనే సరిపెట్టుకుంటున్నారే తప్ప నిర్ధిష్టమైన చర్యలను తీసుకోలేకపోతున్నారు. అక్కడక్కడ ఫిర్యాదులు చేస్తున్న నామమాత్రపు కేసులతో చేతులు దులుపుకుంటున్నారు. ఒక వేళ కల్తీదారులను జైళ్ళకు పంపించినా, జరిమానా కట్టించినా శిక్ష అనుభవించి తిరిగి వచ్చి యధాప్రకారం అదే కల్తీ వ్యాపారంలో మునిగితేలుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని కల్తీగాళ్ళ భరతం పట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Facebook Comments

4 Comments on this Post

  1. I am really pleased to glance at this weblog posts which consists of lots of useful data, thanks for
    providing these kinds of statistics.

  2. Traders do pay direct and indirect costs.

  3. Monetary advisors enterprise is individuals business.

  1. By hey on October 7, 2019 at 2:32 am

    hey

    This is the right blog for everyone who hopes to understand this topic. You know so much its almost tough to argue with you (not that I actually will need to…HaHa). You definitely put a brand new spin on a subject that’s been written about for decades…

Comments have been disabled.