బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

Image Source@ilo.org

రాజ్యాంగ నిర్దేశాలు,చట్టాలు ఇంత స్పష్టంగా చెబుతున్న ఆశించిన ఫలితాలు రావడం లేదు. బాలకార్మిక వ్యవస్థను నియంత్రించడం అటుంచి అంతకంతకు పెరుగుతున్న బాలకార్మికుల నిరోధానికి 1986లో చట్టం తీసుకువచ్చారు. మొత్తం 13వృత్తులకు సంబంధించి 57రకాల పనులను చేయించరాదని ఆ చట్టంలో స్పష్టం చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో 1994లో పటిష్టమైన చర్యలకు అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

రెండు వేల సంవత్సరం నాటికి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించే లక్ష్యంగా కార్యచరణ రూపొందించారు. అయినా ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. మరోపక్క రోజురోజుకు పెరిగిపోతున్న బాలకార్మికుల సంఖ్యను, పరిస్థితులను చూసి ఆందోళన చెందిన దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నో సార్లు హెచ్చరించింది. న్యాయస్థానాలు మందలించినా, మరెన్నో చట్టాలు రూపొందించినా ఎందరికో శిక్షలు వేయించినా బాలకార్మిక వ్యవస్థ అంతకంతకు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. రాజ్యాంగంలోని 24వ అధికరణ బాలకార్మిక వ్యవస్థను సమూలంగా వ్యతిరేకిస్తున్నది. మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో ఈ వ్యవస్థకు మంగళం పాడాలనే ఉద్దేశ్యంతోనే రాజ్యాంగంలోనే పొందుపరిచారు. 14సంవత్సరాల లోపు వయసు గల పిల్లలను వ్యక్తులు గానీ, సంస్థలు గానీ పనిలో పెట్టుకోకూడదని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది. లేత వయసులో ఉన్న పిల్లలను వారి వయసుకు మించిన పనుల్లో పెట్టకూడదని రాజ్యాంగం సుస్పష్టంగా చెప్పుతుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోకి ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర పొరుగురాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బాలకార్మికులను తరలిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధిష్టమైన ప్రణాళికతో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి.

Facebook Comments

Leave a Comment