మానవ వనరుల అభివృద్ధిని సత్వరమే చేపట్టాలి

Image Courtesy: Livemint

దేశం యొక్క అభివృద్ధి విజయం అనేది దాని మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి పై ఆధారపడి వుంటుంది. ఏదైనా దేశం ఎంత బాగా మానవ వనరుల అభివృద్ధి మీద పెట్టుబడులు పెడుతుందో ఆ దేశం ఆర్ధిక సమృద్ధిని సాధించినట్లు అవుతుందని చెప్పవచ్చు. కేవలం దేశం లో మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞాఞాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యం గా ఆ దేశం లో యువతకు ఉన్నత స్థాయి విద్యా, నైపుణ్యాలను అందిస్తే ఆ మానవ వనరులను ఆర్ధిక పెట్టుబడిగా పెట్టి దేశాన్ని పురోభివృద్ధి వైపు నడిపించవచ్చునన్నది మేధావుల అభిప్రాయం. ప్రపంచ ఆర్ధిక వేదిక 130 దేశాలలో సర్వే జరిపి మానవ మూల ధనాన్ని బాగా వినియోగించుకొని ఆర్ధికం గా ఎదిగిన జాబితాను 2017 సంవత్సరం లో విడుదల చేస్తే మన దేశం 103 వ స్థానం లో వుండడం మన మానవ వనరుల అభివృద్ధిలో ఎంత వెనుకబడి వున్నామో ఇట్టే తెలుస్తోంది.

మన దేశ జనాభాలో అత్యధిక శాతం యువత కాగా వారి శక్తి యుక్తులు పూర్తిగా సద్వినియోగం అవడం లేదు. చాలా మంది యువత రకరకాల నైపుణ్య కోర్సులు నేర్చుకుంటున్నప్పటికీ వ్యక్తిగత కౌసల్యం లేక వెనుకబడిపోతున్నారు. ప్రభుత్వం కౌశల్ భారత్ పధకాన్ని ప్రవెశపెట్టి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న ఆశయం మంచిదే కాని అది కాగితాఅకే పరిమితమవడం తో యువత కు సరైన లద్భి చేకూరడం లేదు. ప్రపంచ వ్యాప్తం గా నిరుద్యోగం పెను సవాలుగా మారి ఆయా దేశాల ఆర్ధికాభివృద్ధి కుంటుపడడమే కాకుండా సామాజిక అశాంతికి కారణమౌతోంది. వర్ధమాన దేశాల మధ్య పోటీ పెరుగుతుండడం తో కంపెనీలు వారి ఉత్పత్తులను, సేవలను మెరుగుపరచే వారికి నైపుణ్యాభివృద్ధి వున్న వారికి ఉద్యోగాలు కల్పిస్తొంది. రకరకాల రంగాలు,అంకుర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నా ఆ పరిజ్ఞానం అందిపుచ్చుకునే కౌశలత మన దేశ యువతలో లోపించడం తో ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా లేక చిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. పాఠసాల స్థాయిలో కార్పొరేట్ విద్యా సంస్థలు అడుగుపెట్టడం తో విద్యార్ధులను యంత్రాలుగా మార్చేసాయి. వారిలో వున్న ప్రతిభను, నైపుణ్యాన్ని వెలికి తీయడం లో పూర్తిగా విఫలమౌతున్నాయి. ఈ సంస్థలు విద్యార్ధులను మూసలో పోసినట్లు సాంప్రదాయ విద్యా బోధనకు, శిక్షణకు అంటిపెట్టుకు వుండేటట్లు చేసి ఇంజనీరింగ్, వైద్య విద్య, అక్కౌంట్స్, ఎం బి ఏ లకు మాత్రమే పరిమితం చేస్తున్నారు కానీ కొత్తగా వస్తున్న నైపుణ్య కోర్సుల వైపు మళ్ళించడం లో విఫలమయ్యాయి. తల్లిదండ్రులు కూడా వారి ఆశయాలను పిల్లల నెత్తి మీద బలవంతం గా రుద్ది వారిలోని సృజనాత్మకతను వెలికితీయడం లో పూర్తిగా విఫలమౌతున్నారు. దానితో వారిలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ లేక రెండిటికీ చెడ్డ రేవడిలా మారిపోతున్నారు.కొంత మంది విద్యార్ధులలో ప్రతిభ వున్నా ఆర్ధిక ఇబ్బందుల వలన చదువు మధ్యలో ఆపివేస్తున్నారు.

ఆర్ధికాభివృద్ధి చెందిన దేశాలలో పదహారేళ్ళ వయస్సు నుండి వృత్తి నైపుణ్యానికి సంబంధించిన సంభాషణా చాతుర్యం , సమయ పాలన, సృజనాత్మతకత పెంపొందించుకోవడం వంటి వాటిలో శ్క్షణ ఇప్పించి వారి కాళ్ళ మీద వారిని నిలబదే విధం గా ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర ఐరోపా దేశాలైన నార్వే, ఫిన్లాండ్,స్విజర్లాండ్, డెనార్క్, స్వీడన్ దేశాలు మూల ధన సూచీలో అగ్ర స్థానంలో వుండడానికి కారణం ఆయా దేశాలలో పాఠసాల స్థాయి నుండే విద్యార్ధులకు వృత్తి నైపుణ్యాలను ఎంచుకునే స్వేచ్చ ఇచ్చి దానిని అభివృద్ధి చేసుకునే తోడ్పాటును అందిస్తున్నారు.అత్యంత విదెశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే మన దేశం లో లో హస్త కళా రంగం లో యువతను పదును పెడితే ప్రయత్న లోపం తో వాటి ఎగుమతులు కూడా పెంచవచ్చు. యువతను వారి అభిరుచిని బట్టి ఎంచుకున్న రంగం వైపు మళ్ళేందుకు కావల్సిన శిక్షణ ,ప్రాత్సాహం, ఉపాధి అవకాశాలు కల్పిస్తే వారు తమ ప్రతిభ మరింత మెరుగ్గా కనబరచే అవకాశాలు వుంటాయి. అందువలన మానవ వనరుల అభివృద్ధి చెంది సమగ్ర దేశాభివృద్ధి సాధ్యం.

Facebook Comments

Leave a Comment