ప్రజల ఆకలిని తీర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత..!

Image Courtesy: Pixabay

సమాజంలో నివసించే ప్రతి పౌరుని ఆకలిని తీర్చాల్సిన కనీస బాధ్యత మన ప్రభుత్వాలపైన ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆహార సమస్య అనేది విశ్వవ్యాప్తంగా ఉన్న సమస్య అతి ప్రధానమైనదంటే అతిశయోక్తి కాదు. ఆయా దేశాల ప్రభుత్వాలు ఆహార సమస్య పరిష్కారానికి ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వడం లేదన్నది కాదనలేని వాస్తవం.

ప్రపంచ వ్యాప్తంగా 7900కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ తెలియజేసింది. అంతేకాదు ప్రపంచ జనాభా పెరుగుదల వేగాన్ని పరిశీలించినట్లయితే 2050నాటికి మరో 80శాతం ఆహార ఉత్పత్తులు అదనంగా అవసరమవుతాయని కూడా వెల్లడించింది. భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని ఆహార ఉత్పత్తులను పెంచే దిశగా చాలా దేశాలు ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. భారతీయ సమాజంలో ఒక్క పూటకు కూడా తినడానికి నోచుకోని అభాగ్యులు ఉన్నారు. మూడు పూటలా హాయిగా తినేవాళ్ళు జీవిస్తున్నారు. ఆకలితో అన్నమో రామచంద్ర అని విలపిస్తున్న వాళ్ళు ఒకవైపు, విందులు, విలాసాలతో ఉన్నతమైన జీవితం గడుపుతూ యథేచ్చగా ఆహారాన్ని వృథా చేస్తున్నారు మరోవైపు ఉన్నారు. మధ్యతరగతి వారి సంగతీ సరేసరి. అన్నం పరబ్రహ్మస్వరూపం అని పెద్దలు చెప్పేవారు. ఆహారాన్ని పరమపవిత్రంగా భావించే పుణ్యభూమిలో అనవసరంగా ఆహారాన్ని వృథా చేయడం అత్యంత బాధాకరం. ఆహారం వృథా అనేది భారత్ కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్య ఇది. ప్రధానంగా సంపన్న దేశాలలో అధికంగా ఉన్న సమస్య భారతదేశంలో ప్రతి సంవత్సరం 2కోట్ల టన్నుల పైచిలుకు ఆహారం వృధా అవుతున్నాయి. మన దేశంలో మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు లెక్కకు మించి ఉండటం. దానికి భారీగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అప్పులబారిన పడటానికి ఇది కూడా కారణంగా చెప్పవచ్చు.

ప్రకృతి వైపరిత్యాలైన అతివృష్టి, అనావృష్టి,ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాలను పూడ్చాలి. రైతన్నల ఈ దృష్టికి ప్రకృతిని నిందించి ప్రయోజనం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. అధిక దిగుబడుల కోసం రైతులకు అవగాహన కల్పించాలి.

Facebook Comments

Leave a Comment