అవగాహనే కిడ్నీ సమస్యలకు విరుగుడు

Image Courtesy: The Health Magazine

వందకోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో కేవలం 2వేల మంది మాత్రమే కిడ్నీ నిపుణులు ఉన్నారు. వీరిలో అధిక శాతం పట్టణాలు,నగరాల్లో నివసిస్తున్నారు. 90శాతం రోగులు రక్తశుద్ధిని చేసుకొనే స్థాయికి రాలేకపోతున్నారు. ఒక వేళ డయాలసిస్ మొదలు పెట్టినా,అరవై శాతం మొదటి సంవత్సరంలోనే చనిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆర్ధిక సమస్యలు,అవగాహనా లోఫమే ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.

మారిన పరిస్థితుల్లో కిడ్నీ మార్పిడి ఖరీదైన చికిత్సగా పరిణమించింది. మౌలిక సదుపాయాల కల్పన,వైద్యుల వృత్తిపరమైన శిక్షణకు ఎక్కువ ఖర్చు అవుతోంది. అవయవ దాతల కొరత,దీర్ఘకాలం డయాలిసిస్ చేయించుకోవలసిన అవసరం కారణంగా ఖర్చులు తడిసి మోపెడవుతోంది. ఇక కిడ్నీల రక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించడం అన్నింటికన్నా ముఖ్యం. స్వచ్చమైన మంచి నీరు,వ్యాయామం,మంచి ఆహారం,పొగాకు నియంత్రణ వంటి తదితర చర్యల ద్వారా కిడ్నీ వ్యాధులను వాటి తీవ్రతను కొంతలో కొంతవరకైనా నివారించవచ్చు. మూత్ర,రక్త పరీక్షల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే నివారణ తేలికవుతుంది. రక్తపోటు,కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం కావలసిన మందులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. అవయవ దానాన్ని దేశమంతా అవసరమైన విధానంగా అనేక రాష్ట్రాల్లో ప్రారంభదశలోనే ఉంది. కిడ్నీలు దెబ్బతిన్న తరువాత అందించే చికిత్స ఖర్చుతో కూడుకొన్నది. డయాలిసిస్,కిడ్నీ మార్పిడి తరువాత చాలా మంది ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందలేకపోడానికి కారణం అవగాహనా లోపమే అని చెప్పవచ్చు. యాభై శాతం పైగా రోగులు మొదటి ఆరు నెలల్లోనే చనిపోవడమనేది బాధాకరం. డయాలిసిస్ మాత్రమే రోగులను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయలేదు.

మంచి ఆరోగ్య లక్షణాలు మితాహారం,వ్యాయామం వంటి అంశాలు వ్యాధి నివారణకు దోహదపడతాయి. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడం ద్వారానే ఈ వ్యాధిని ఆరంభదశలోనే సాధ్యమైన మేర కిడ్నీ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు

Facebook Comments

Leave a Comment