నాలుగో పారిశ్రామిక విప్లవంలో అవకాశాల వెల్లువ..!

నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఆవిష్కృతమవుతున్న నూతన సాంకేతికత ఇండియాకు అసంఖ్యాకమైన అవకాశాలను కల్పిస్తున్నది. ప్రత్యేకించి యువ జనాభా ఎక్కువగా ఉండటంతో పాటు అంకుర పరిశ్రమలు, నైపుణ్యం గల యువ పట్టభద్రులు, వృత్తివిద్యానిపుణులు ఉండటం వలన ఈ రంగంలో అంతర్జాతీయంగా మొదటి పదిస్థానాల్లో నిలబడటానికి సాయపడుతున్నాయి. మూడు దశబ్దాలుగా సేవల రంగంలో భారత సంస్థలు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాయి.

తాజాగా జరుగుతున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు యంత్రయుగం వైపు అడుగులు వేయిస్తున్నాయి. అయితే ఈ మార్పులు మానవాళికి అవకాశాల కల్పనతో పాటు పలు సవాళ్ళను విసురుతున్నాయి. పరిశ్రమల్లోనే కాదు అనేక రంగాల్లో రోబోల ప్రవేశంతో లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. మెషిన్ లెర్నింగ్,బిగ్ డేటా,క్లౌడ్ కంప్యూటింగ్, ఈ కామర్స్ తదితర రంగాల్లో ఉద్యోగ లభ్యత పెరిగనున్నది. డిజిటల్ నైపుణ్యత, మార్కెటింగ్లో చొరవ ఉద్యోగనేషణలో ప్రధాన భూమికను పోషించనున్నాయి. డిజిటల్ అక్షరాస్యతే అన్ని ఉద్యోగాలకు తొలిమెట్టు అని నివేదిక చాటింది. నైపుణ్యం లేకపోవడం,సేవల్లో నాణ్యతా లోపం, నాయకత్వలేమి, పెట్టుబడికి అవసరమైన మూలధనం కొరత,కొత్తదనాన్ని స్వీకరించి నేర్చుకునే సరళత్వం కొరవడటం ఉద్యోగాలకు ప్రధాన అడ్డంకిగా చెప్పవచ్చు. మధ్యతరగతి పెరుగుదల,యువతలో డిజిటల్ అక్షరాస్యత ఇనుమడించడం, నగరీకరణ తదితర అంశాలు ఎదుగుదలకు చేయూతనిస్తాయి. ప్రభుత్వపరంగా ఆటోమేటివ్ ఇండియా, మేకిన్ ఇండియా కార్యక్రమాలతో డిజిటల్,కృత్రిమ మేధ రంగాల్లో నూతన పరిశోధనలు ఊపందుకున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సులభతర వాణిజ్య విధానాలకు అనుగుణంగా కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి.

నూతన టెక్నాలజీపై కార్పోరేట్ సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ, నూతన ఉద్యోగాలకు అనుగుణంగా యువతకు శిక్షణ కార్యక్రమాలు, వినియోగదారులకు అందుబాటులో ఉండేలా టెక్నాలజీ బదలాయింపు జరగాలని నిపుణుల కమిటీ సలహా ఇచ్చింది. నూతన వాణిజ్యానికి అడ్డుగా ఉన్న విధానం, సైబర్ దాడులు,ప్రభుత్వ విధానాల్లో మార్పు, పర్యావరణ సమస్యలు,ఆర్ధిక విధానంలో ఒడిదుడుకులను అధిగమిస్తే భారత యువత మరెన్నో రికార్డులను సృష్టిస్తది.

Facebook Comments

Leave a Comment