లక్ష్యాలకు ఆమడ దూరంలో దేశ ప్రగతి

పేదరికం, నిరుద్యోగం నిర్మూలించి సామాజిక న్యాయాన్ని సాధించే లక్ష్యం గా మన దేశం లో మొదటి పంచ వర్ష ప్రణాళిక రూపొందించబడింది. కాని ఇప్పటి వరకు మనకు పన్నెండు పంచ వర్ష ప్రణాళికలు గడిచిపోయినా, అనుకున్న లక్ష్యాలను సాధించడం లో కనుచూపు మేరలో ఆగిపోవడం దుఖభరితమైన విషయం. ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థల జాబితాలో ఆరవ స్థానంలో వున్న భారత్ మౌళిక వసతులైన ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పనలో ప్రగతి మందగమనంలో వుండడం గర్హనీయం.

మన రాజ్యాంగానికి న్యాయం, స్వేచ్చ, సౌభ్రాతృత్వం, సమానత్వం మూల స్థంబాలైనా వాటిలో అసమానతలు మన దేశ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారాయనడం లో ఎలాంటి సందేహం లేదు. లింగ వివక్షను రూపుమాపడానికి మహిళా సాధికారత సాధనకు 17 సంవత్సరాల క్రితమే జాతీయ విధానం రూపు దిద్దుకున్నా మహిళలకు లభిస్తున్న అవకాశాలు అధమంగా వుండడం, మహిళా కార్మీకులు 2015-16 వ ఆర్ధిక సంవత్సరానికి గాను 24 శాతానికి పడిపోయారని జాతీయ కుటుంబ సంక్షేమ సంష తాజా నివేదిక ప్రకటించడం సమానత్వ సాధలనో పాలకుల వైఫల్యం ప్రస్పుటం చేస్తోంది. 144 దేశాల లింగ అసమానత్వ సూచీలో మన దెశం 108 వ స్థానం లో వుండడం మహిళా సాధికారత పట్ల ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం పధకాల వైఫల్యం కనబడుతోంది. ఉగాండా, ఫిల్లిపైన్స్ వంటి అల్పాదాయ దేశాలు కుడా మహిళలను మానవ వనరులుగా ఉపయోగించి వారికి విద్యా , ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురుషులతో సమానం గా వాటాలు ఇచ్చి దేశాన్ని ముందుకు నడిపిస్తుంటే మన దేశం సాధికారతను మాటలకే పరిమితం చేసి కిందకు నానాటికీ దిగజారిపోతోంది.. మన దేశానికి వెన్ను ముక్క వంటి వ్యవసాయ రంగం పూర్తిగా పాలకుల అలక్ష్యానికి గురైంది. పారిశ్రామీకరణ, పట్టణీకరణ పేరుతో వ్యవసాయ భూములను పారిశ్రామిక కారిడార్లుగా మార్చి రైతు వెన్ను విరవడం దురదృష్టకరం. దెశ ఆర్ధికాభివృద్ధిలో తన వంతు క్ర్షి చేసిన రైతులు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై గంపెడు ఋణభారంతో వలస కూలీలుగా మారడం బాధాకరం.మన దేశం అనూహ్య ప్రగతి సాధించిందని డంబాలు పలుకుతున్న విధ్యా, ఆరోగ్య రంగంలో, పీకల్లోతు సంక్షోభం లో కూరుకుపోయిందని, ప్రపంచ దేశాలతో పోలిస్తే మన స్థానం నానాటికీ దిగజారిపోతోందని అర్ధమౌతొంది. పేదా ధనిక అసమానతల వలన 40 కోట్ల మందికి పైగా భారతీయులు అవిద్య, అనారోగ్యం తో కొట్టుమిట్టాడుతున్నారని వివిధ సర్వేలు ప్రకటించడం జీర్ణించుకోలేని విషయం. ఇంత అభివృద్ధి సాధించిన దేశం లో మరొక దయనీయమైన విషయం సగానికి పైగా మన రాష్ట్రాలు అభివృద్ధి ప్రమాణాలలో నిర్దేశిత ప్రమణాల కంటే తక్కువగా వున్నాయని నీతి ఆయోగ్ ఇటీవలే ప్రకటించడం శోచనీయం.

నాలుగో వంతు జిల్లాలు అభివృద్ధికి ఆమడ దూరంలో, సగం పల్లెలలో జీవనోపాధి, విద్య, వైద్య వసతులు కరువై పేదరికం తో కొట్టుమిట్టాడుతూ దుర్భరమైన జీవితం గడుపుతున్నారంటే పధకాలన్నీ తప్పుదారి పడుతున్నాయని అర్ధమౌతొంది. గ్రామీణ జనాభాలో మూడు వంతుల మందికి నెలకు అయిదువేల రూపాయల కంటె తక్కువ ఆదాయం తో జీవితాలను ఈడ్చడం మన అభివృద్ధి అంతా కాగితాకే పరిమితం అవుతోందనదం లో ఎటువంటి సందేహం లేదు.మధ్య స్థాయి ఆదాయ దేశాలు అయిన శ్రీ లంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఆర్ధికాభివృద్ధికై అనేక సంస్కరనలు తీసుకు వచ్చి పురోగమనం వైపు దూసుకు వెళ్తుంటే మన దేశం మాత్రం ఇంకా ఈ విషయం లో మీనమేషాలు లక్కపెడుతూ త్రిశంకు స్వర్గం లా ప్రగతిలో మధ్యస్థానికే పరిమితమైపోవడం పాలకులు ఆలోచించాల్సిన విషయం.

Facebook Comments

Leave a Comment