21 వ శతాబ్దం లో కూడా ఆకలికేకలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో పోటీపడుతూ పురోగమనం వైపు మళ్ళుతున్నా మన దేశం లో చాలా మంది జనాభాకు ఆహారం అందక అనారోగ్యం తో మరణిస్తున్నారన్నది అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఇండియా స్టేట్ హంగర్ ఇండెక్స్ పరిశోధనలో ప్రకటించినట్టుగా సుమారుగా 40 కోట్ల మందికి తిండి దొరక్క ఆకలి మంటలతో అలమటించడం పాలకుల వైఫల్యానికి నిదర్సనం.

దేశం లో పారిశ్రామీకరణ జరిగి ఆర్ధికాభివృద్ధి జరుగుతున్నా, అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి కొనసాగుతున్నా, కొన్ని కోట్ల మందికి పట్టెడన్నం దొరకకపోవడం చాలా బాధాకరమైన విషయం. స్వాతంత్రం సిద్ధించి ఏడు దసాబ్దాలు దాటినా ప్రజల కనీస అవసరాలైన కుడు, గూడు, బట్టలు ప్రతి పౌరుడికీ అందాలని రాజ్యంగం గుర్తించినా ఆహార భద్రతను కల్పిస్తున్నామని ప్రభుత్వాలు డాంబికాలు పలుకుతున్నా, ఆకలి చావులు తగ్గకపోవడం ఈ వ్యవస్థ వైఫల్యానికి మచ్చుతునక. ఒక వైపు పేదరికం, రెక్కాడితేనే గాని డొక్కాడని దుస్థితి, దానికి తోడు నిత్యావసర ధరలు ఆకాసానికి అంటడం తో మన దేశ జనాభాలో దాదాపు 12 కోట్ల మందికి రోజూ భోజనం లభించడం మృగ్యమైపోతోంది. ఈ ఆహార సమస్యను అధిగమించదానికి, కనీసం 40 కోట్ల మంది కడుపు నింపదానికి, 2013 లో కేంద్ర ప్రభుత్వం తెచ్చీన ఆహార భద్రతా చట్టం ఆశించిన ఫలితాలను అమించడం లో విఫలమయ్యింది. ఈ చట్టం కింద పేదలకు నిత్యావసరాలైన బియ్యం, గోధుములు వంటి రాయితీ సరుకులను అందించడానికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ప్రజా పంపిణీ వ్యవస్థపై ఖర్చు చేస్తున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ లొసుగుల మయమై రాయితీ సరుకులు నల్ల బజారుకు తరలిపోవడం తో పేదల కడుపులు మల మలా మాడిపోతున్నాయి.12 లక్షల ప్రభుత్వ పాఠశాలలలో 15 కోట్ల మంది పేద ప్రజల ఆకలి తీర్చడానికి వారిలో పౌష్టికాహార లోపం నివారించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రవేశపెట్టింది. అంతే కాకుండా బాలింతలకు, గర్భిణీలకు 6 సంవత్సరాల లోపు చిన్న పిల్ల్లలకు ఉచిత వైద్య, పౌష్టికాహార సదుపాయాలు కల్పించడానికి 1975 లో ప్రారంభించిన సమగ్ర శిశు సేవా పధకాన్ని( ఐ సి డి ఎస్) కింద 13.56 లక్షల అంగన్ కేంద్రాలను ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. కాని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే ఆహారం లో నాణ్యత కొరవడడం, పర్యవేక్షణా లోపం తో ఆశయం గొప్పదైనా ఫలితాలు శూన్యం గా వుంటున్నాయి. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న జటిలమైన సమస్యలు పౌష్టికాహార లోపం, రక్త హీనత లను ఎదుర్కోవడం లో దసాబ్దాల తరబడి పాలకుల ఘోర వైఫల్యం కళ్ళరా కనిపిస్తొంది. ప్రజా పంపిణీల ద్వారా బియ్యం మాత్రమే లభ్యం కావడంతో.. కూరగాయలు, నూనెలు, ఇతర నియావసర సరుకుల ఆకాశయానం చేస్తుండడం తో కూలికి వెళ్ళిన పేదలు పని దొరక్క, దొరికిన పనికి కనీస వేతనాలు అందక, ఎక్కువ మంది జనాభా రోగాల పాలవుతున్నారు. మన దెస జనాభాలో 14.5 శాతం పౌష్టికాహార లోపం, 51.4 సాతం రక్తహీనత, 38 శాతం పిల్లలలో బరువు ఎక్కువా లేక తక్కువ వంటి లోపాలతో బాధపడుతున్నారని జాతీయ సమగ్ర పౌష్టికాహార సంస్థ వెలువరించిన నివేదిక భయాందోళనలకు గురి చేస్తోంది.

మన దేశం లో మరొక పెద్ద సమస్య ఆహార నష్టం. గోదాములలో నిల్వ వుంచిన బియ్యం, గోధుములు పళ్ళు, కూరగాయలు పాడైపోయి, పురుగులు పట్టి వృధా అయిపోతున్నాయి. విందులు, వినోదాలలో లక్షల రూపాయల విలువైన ఆహార పధార్ధాలు ఏమీ కాకుండా చెత్త కుండీలలో పారబోయడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ సమస్య మరింత తీవ్రతరం కాక ముందే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక వేత్తలు, కార్పొరేట్ సామాజిక సంస్థలు ముఖ్యం గా ప్రజానీకం కలిసికట్టుగా, సమైక్యం గా కృషి సల్పితేనే సమస్య నివారణ సాధ్యపడుతుంది.

Facebook Comments

Leave a Comment