థర్మల్ విద్యుత్ కేంద్రాలతో ప్రజారోగ్యానికి ముప్పు..!

ప్రజల ఆరోగ్య భద్రత పాలకుల ప్రథమ కర్తవ్యంగా చెప్పవచ్చు. ప్రజారోగ్య సమస్యల్లో కూరుకుపోయిన ఏ దేశమూ అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. కాలుష్య సంబంధిత అనారోగ్యాల నుండి ఇటు మనుషులైనా, అటు పశువులైనా కోలుకోవడం చాలా కష్టం. థర్మల్ విద్యుత్ కేంద్రాలున్న ప్రాంతం యొక్క పరిసరాలు, నదీ జలాలు కలుషితమై ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఈ కేంద్రాల్లో ఏటా మండించే బొగ్గు పరిమాణం గత ఐదేళ్ళ వ్యవధిలో 59కోట్ల టన్నుల నుంచి 68కోట్ల టన్నులకు చేరింది.

సమీప భవిష్యత్తులో ఇది వంద కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. టన్ను బొగ్గును విద్యుత్ కేంద్రంలో మండించి విద్యుత్ ఉత్పత్తి చేస్తే సగటున 350కిలోలకు పైగానే బుడిద వస్తోంది. దీంతోపాటు అనేక రకాల విషవాయువులు వెలువడటం వల్ల థర్మల్ కేంద్రాలున్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, కాలుష్యం పెరగడం సహజం. మన దేశంలోని బొగ్గును మండిస్తే 35నుండి40 శాతం దాకా బూడిద వెలువడుతోంది. అదే విదేశీ బొగ్గును మండిస్తే బూడిద తక్కువగా, గంధకం ఎక్కువగా వెలువడుతోంది. ప్రజలకు వెలుగులను అందిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు వెదజల్లుతున్న కాలుష్యానికి అంతు లేకుండాపోతుంది. వీటి నుండి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆధునిక పరిజ్ఞానం ఏర్పాటు ఎప్పుడన్నది ప్రశ్నార్ధకంగా మారింది. విషపూరిత కాలుష్య వాయువులు వెలువడకుండా నియంత్రించే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా, వాటిని అమర్చేందుకు నిధుల కొరత ఎదురవుతోంది.

ప్రజలు అనారోగ్యాల పాలయితే చికిత్సల కోసం ఆయుష్మాన్ భవ, ఆరోగ్యశ్రీ అంటూ పథకాలకు కొన్ని వేల కోట్లు కుమ్మరిస్తున్నారు. ప్రజలు అనారోగ్యం బారినపడటానికి మూలకారణాల్లో ఒకటైన కాలుష్యాన్ని నియంత్రించడానికి అందులో పదోవంతు మొత్తాన్ని ఇచ్చినా సరిపోతుంది. బడ్జెట్లలో నిధులు కేటాయించి థర్మల్ కేంద్రాలను ఆధునీకరిస్తే కాలుష్య చీకట్ల నుండి ప్రజలకు రక్షణ చేకూరుతుంది.

Facebook Comments

3 Comments on this Post

 1. If you can, enter the casino without entering any sensitive information regarding yourself and
  check it out. You will be given $500 to $1,000 free chips and also you must wager it for 1 hour.

  These online no deposit casino bonuses are merely suited for your beginners who will be trying to learn the games and need to bet
  their real money. https://bbdevtt.com/supercasino/

  Reply
 2. Blogging demonstrates true commitment and passion to your industry that you will can’t fake
  long-term. The placing ads smack in the center of interrupting content can be a
  bad idea. Affiliate marketing doesn’t be rewarded quickly. https://918kiss.poker/casino-games/72-playboy-casino

  Reply
 3. Everyone loves what you guys are usually up too. Such clever work and coverage!
  Keep up the wonderful works guys I’ve included you guys
  to my own blogroll.

  Reply

Leave a Comment