ఉదారవాద ఆర్ధిక విధానాల మంచి చెడుల విశ్లేషణ

Graphic Courtesy: rebellionvoice

1980-2000 మధ్య కాలంలో సామాన్య ప్రజల్లో సైతం ఎన్నో భ్రమలను రేకెత్తించిన నయా ఉదారవాద విధానాలు ప్రపంచ వ్యాపితంగా ప్రజల ఆమోదాన్ని కోల్పోతున్నాయని ప్రపంచ వ్యాప్తం గా వివిధసంస్థలు చేస్తున్న సర్వేలు తెలియజేస్తున్నాయి. పర్యవసానంగా కార్మికవర్గం యూరపులో పెద్దయెత్తున ఉద్యమంలోకి వస్తోంది. రైతులు, నిరుద్యోగులు సైతం ఉద్యమాల బాట పడుతున్నారు. దశాబ్దాలతరబడి అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రపంచ వ్యాపితంగా సంక్షోభాలకు తెర తీస్తున్నాయి.

2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముందున్న స్థితికి 180 దేశాలు ఇప్పటికీచేరుకోలేదని, గత నాలుగేళ్ళుగా అద్భుత ప్రగతి సాధిస్తున్నామని ప్రకటించుకుంటున్న భారత దేశం లో కూడా ఆర్ధిక సంక్షోభం, ఆర్ధిక విధ్వంసం చాప కింద నీరులా విస్తరిస్తొందని ఇటీవలి ఐ ఎం ఎఫ్నివేదిక స్పష్టం చేసింది. గ్రీస్‌, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రెజిల్‌, శ్రీలంక ,దేశాలలోని వివిధ పరిణామాలు, ప్రజలలో రగులుతున్న అసంతృప్తి, పెరుగుతున్న నిరుద్యోగం, అనూహ్యం గా పెరిగినప్రజల ఖర్చులు, ఆర్ధిక భారం ఈ సంగతినే రుజువు చేస్తున్నాయి.. అమెరికాలో ఆర్థిక సంక్షోభాన్ని ఉపయోగించుకుని అమెరికా ఫస్ట్ వంటి అందమైన నినాదంతో అధికారం లోనికి వచ్చిన ట్రంప్ ఆధ్వర్యంలోని డెమాక్రటిక్ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన ప్రొటెక్షనిజం, సైనిక జోక్యం, వాణిజ్య యుద్ధాలు ఆర్థిక సంక్షోభానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అమెరికా కు ఆర్ధికం గా ఊతం కలిగించే ఏ అవకాశాన్ని వదులుకోని ట్రం ప్ ప్రభుత్వం తన అపసవ్య విధానాలు, నిరంకుశ ధోరణి, ఆధిపత్య ఆలోచనా ధోరణి వలన యావత్ ప్రపంచం ఆర్ధిక సంక్షోభం లోనికి నెట్టబడుతోంది. మధ్య అమెరికాలోని హోండూరస్‌,గ్వాటెమాల దేశాల నుంచి పేదలు భారీగా వలసలు పెరగడానికి అమెరికా విధానాలు ముఖ్య కారణం. ఈ వలసలను అడ్డుకునేందుకు ట్రంప్‌ ప్రభుత్వం సరిహద్దులకు సైన్యాలను తరలిస్తూ మానవహక్కులను బాహాటంగా కాలరాస్తున్నది. ముందస్తు సంకేతాలు లేక హెచ్చరికలు కూడా జారీ చెయ్యకుండా ఏకపక్షం గా కాల్పులు జరుపుతూ ఇప్పటికే వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకొనిఅపారమైన పాపం మూట కట్టుకుంది.ఇంత జరుగుతున్నా ఐక్య రాజ సమితి కానీ, ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సమితి కానీ అమెరికాను ఒక్క మాట అనకపోవడం, తన ప్రజా వ్యతిరేక విధానాలనుమార్చుకోమని అనకపోవడం విడ్డూరం గా వుంది.ఈ దేశాలలో అనూహ్యం గా పెరుగుతున్న పేదరికాన్ని తగ్గించడం ఇప్పట్లో సాధ్యం కాదని ప్రపంచ ఆర్ధిక, సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.బ్రిటన్‌లో థెరిస్సా మే నేతృత్వంలోని కన్సర్వేటివ్‌ ప్రభుత్వం ఎకనమిక్ యూనియన్ ను సంతృప్తి పరచడానికి ‘మృదు బ్రెగ్జిట్‌’ పేరుతో కొత్త ఫార్ములాను ముందుకు తీసుకొచ్చింది. దేశం లోకి ఎకనమిక్ యూనియణ్ లోని సభ్య దేశాలలో ఉత్పత్తి అయె వస్తువులను నేరుగా బ్రిటన్ లోనికి దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే ఈ ఫార్ములా వలన విదేశీ కంపెనీలు బాగుపడుతుండగా స్వదేశం లో స్వదేశీ పరిజ్ఞానం తో తయారయ్యే ఉత్పత్తులకు గిరాకి తగ్గిపోయి ఏకం గా కంపనీలే మూతబడిపోయే విపత్కర పరిస్థితులు ఎదురౌతాయి. దేశం లో పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ అవకాశాల రూపకల్పన గణనీయం గా తగ్గిపోయి దేసం లో ఆర్ధిక సంంక్షోభం ఏర్పడుతూందని ఎందరో హెచ్చరించినా తగ్గని ప్రధాని, ప్రజా చైతన్యం వలన ప్రభుత్వం మీద వత్తిడి రావడం తో పాటు చివరకు తన స్వంత పార్టీ నుండే తీవ్ర వ్యతిరేకత ఎదురవడం వలన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ విధం గా జర్మనీ, శ్రీ లంక, సిరియా, మెక్సికో, బ్రెజిల్ ఇలా అనేక దేశాలు పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందాన అమెరికా, ఫ్రాన్స్ వంటి దిగ్గజాలను చూసి నయా ఆర్ధిక ఉదారవాద సంస్కరణలు అవలంబించడం వలన పీకల్లోతు సంక్షోభం లో కూరుకుపోయాయి.

మరొకపక్క తమ పబ్బం గడుపుకునేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఏకపక్షంగా, ఆధిపత్య ధోరణితో అభివృద్ధి చెందుతున్న దేశాలను బలవంతం గా ఉదారవాద విధానాలను అవలంబించేందుకు వత్తిడి తెస్తున్నాయి.

Facebook Comments

Leave a Comment