ఐ ఎల్ వో సిఫార్సులను తక్షణం అమలు చేయాలి

ఎన్నో పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను హరించడానికి పాలకులు దుస్సాహసానికి ఒడిగట్టి నట్లయితే వీరు కార్మికుల ఆగ్రహజ్వాలలకు గురి కాక తప్పదని ప్రపంచ వ్యాప్తం గా జరిగిన ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ధనికులకు ఎర్ర తివాచీ పరచడం, పేద మధ్య తరగతి వర్గాలకు ఎంగిలి చేత్తో విసిరేసినట్లు జీత భత్యాలను ఇవ్వడం అనేది కేపిటలిజం విధానాలు పుంజుకున్నాక ఒక రివాజుగా మారింది. కొన్నేళ్లుగా భారత్ తో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ వారి హక్కులను హరించేందుకు పూనుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మన దేశానికి స్వాత్రంత్రం వచ్చాక ప్రభుత్వాల అపసవ్య విధానం వలన ధనికులు మరింత ధనికులైపోగా, పేద మధ్య తరగతి వర్గాల సంక్షేమం, అభివృద్ధి మాత్రం నత్త నడకన సాగుతొంది. ఫలితంగా మన దేశంలో 60 శాతం సంపద కేవలం 1 శాతం కోటీశ్వరుల వద్ద పోగుపడింది. మరొక వైపు దేశం లో పూటకు పట్టెడన్నం కూడా అందక ఆకలి చావుల బారిన పడుతున్న వారి సంఖ్య లక్షల్లో వుండడం నిజంగా దురదృష్టకరం. దేశం లో సంక్షేమ పధకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలందరికీ సమానంగా అందుబాటు లోనికి తీసుకురావాలన్న భారత రాజ్యాంగం యొక్క స్పూర్తిని తుంగలోనికి తొక్కే విధంగా ప్రభుత్వ పధకాలు వుండడం నిజంగా విచారకరం. ఐఎల్ఓ ఒప్పందాలను గౌరవించడానికి బదులు ఆయా ప్రభుత్వాలు బహుళజాతి సంస్థల తరపున కార్మికులు, కార్మిక సంఘాలను అణచివేసి వేతనాలను ప్రత్యేకించి శ్రామిక మహిళల వేతనాలను చాలా తక్కువగా వుంచి, వారి పని పరిప్థితులను ప్రమాదకరంగా తయారు చేశాయి.

ఇటీవల జరిగిన ప్రపంచ కార్మీకుల సదస్సులో నూతన కార్మిక రక్షణలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. అధునాతన పని ప్రదేశాలల్లో మారుతున్న స్వభావం, డిమాండ్లు తీర్చడానికి ప్రపంచ దేశాల ప్రభుత్వాలు చట్టాలు రూపొందించి, నిబద్ధతను ప్రకటించాలని ఐఎల్ఓ డిమాండు చేస్తున్నది.

ఐ ఎల్ వో నియమిత సాధికారిక కమిటీ రెండేళ్ళ పాటు అవిశ్రాంత కృషి సల్పి పది ప్రధానమైన సిఫార్సులు చేసింది. “ప్రాథమిక కార్మిక హక్కులు, తగినంత జీవన వేతనం, పనిగంటలపై పరిమితులు, సురక్షిత, ఆరోగ్యవంతమైన పని ప్రదేశాలు పరిరక్షణకు సార్వజనీన కార్మిక హామీ” వీటిలో ప్రధానమైన సిఫార్సు. అయితే ఈ నివేదిక వెలువడిన కొద్ది రోజులలోనే సామ్రాజ్య వాద దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా వంటివి సదరు నివేదికను, దాని ఆధారం గా ఐ ఎల్ వో చెసిన విజ్ఞ్ఞప్తిని తోసిపుచ్చాయి. అయితే సొషలిజాన్ని నర నరాలలో జీర్ణించుకున్న భారత దేశం లో ఇటువంటి చర్యలు వుండవనే యావత్ పేద, మధ్య తరగతి వర్గం ఆశిస్తొంది. ఐఎల్ఓ నివేదికలు, వాటి ఒప్పందాలకు, ఒడంబడికలకు చట్టబద్ధత ఏవిూ వుండకపోవడం నిజంగా దురదృష్టకరం.

Facebook Comments

2 Comments on this Post

  1. Think about investments that provide speedy annuities.

    Reply
  2. Buyers do pay direct and oblique costs.

    Reply

Leave a Comment