చానెళ్ళపై ట్రాయ్ నిర్ణయం తో వినియోగదారులలో గందరగోళం.

వినియోగ దారులు ఇకపై తాము చూడాలనుకున్న ఛానళ్లకే చెల్లింపు’ పేరిట టెలికమ్యూనికేషన్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్) తీసుకున్న నిర్ణయందేశవ్యాప్తం గా కలకలం రేపుతోంది. వాస్తవిక పరిస్థితులకు దూరం గా సదరు నిర్ణయం వుందన్న అభిప్రాయం తో దేశవ్యాప్తంగా కేబుల్‌ ఆపరేటర్లు ఈ నిర్ణయాన్నివ్యతిరేకిస్తుండగా, ఛార్జీల విషయంలో స్పష్టత లేకపోవడంతో వినియోగదారుల్లోనూ గందరగోళం నెలకొంది. వ్యతిరేకిస్తున్నారు. వినియోగ దారులు కూడా ప్రభుత్వం నుండిరోజుకొక ప్రకటన వస్తుండడం తో ఎంత చార్జీలు చెల్లించాలన్న విషయం లో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. తొలుత ట్రాయ్ సదరు నిర్ణయం వలన వినోదం చవుకఅవుతుందని ప్రకటన ఇచ్చింది. అనంతరం వివిధ పత్రికలు, మీడియాలో వినోదం ఇక మీదట ప్రియం అవుతుందని, వినియోగదారుడు కేబుల్ ఆపరేటర్లకు అదనంగానెలకు రెండు వందలు చెల్లించాల్సి వస్తుందని, ఇది మధ్యతరగతి ప్రజానీకం పై అదనపు భారం పడనున్నదని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం సదరు నిర్ణయాన్నిఉపసంహరించుకోకపోతే జనవరి ఒకటి నుండి పే చానెళ్ళ ప్రసారాన్ని నిలిపివేస్తామని అఖిల భారత కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడంముదురుతున్న సమస్యకు నిదర్శనం. అయితే ప్రభుత్వం చొరవతో నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకుని వాటికి మాత్రమే డబ్బు చెల్లించే కొత్త విధానాన్ని తీసుకొచ్చిన ట్రాయ్‌.. దాని అమలు గడువును నెల రోజుల పాటు పొడిగించినట్టు తెలిపింది. దీంతో టెలివిజన్‌ వీక్షకులకు కొంత మేర ఊరట కలిగినట్టయింది. ట్రాయ్‌ తొలుత పేర్కొన ప్రకారం డిసెంబర్‌ 29న నూతన విధానం అమల్లోకి రావాల్సి ఉంది. కానీ టీవీ వీక్షకుల సౌకర్యార్థం ట్రాయ్‌ ఈ గడువును ఫిబ్రవరి 29 వ తేదీ వరకు పొడిగించింది. గురువారం ప్రసార సంస్థలు, డీటీహెచ్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో సమావేశం నిర్వహించిన ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. . ప్రస్తుతమున్న విధానంలో డిటిహెచ్‌,ఎంఎస్‌ఓ, కేబుల్‌ టీవీ ఆపరేటర్లే ఛానళ్లను ఎంపిక చేసి, ఇంత మొత్తమని వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారునికి ఇష్టమున్నా, లేకపోయినా ఆమొత్తాన్ని చెల్లించక తప్పదు. 2014 వ సంవత్సరం లో అనలాగ్‌ నుండి డిజిటిల్‌ విధానానికి కేబుల్‌ టీవీలు మారిన తరువాత కూడా ఆశించిన స్థాయిలో పారదర్శకతరాలేదని, వినియోగదారులకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభించ లేదనేది వాస్తవం. ప్రస్తుతం డిటిహెచ్‌, ఎంఎస్‌ఓ, కేబుల్‌ టీవీ ఆపరేటర్లే ఛానళ్లను ఎంపిక చేసి, ఇంతమొత్తమని వసూలు చేస్తున్నారు. ఏయే చానెళ్ళు ప్రసారం చెయ్యాలనే విషయం లో తుది నిర్ణయం కూడా వీరిదే. దీనితో వినియోగదారునికి ఇష్టం వున్నా లేకపోయినా వారు నిర్దేశించిన రుసుం చెల్లించి కేబుల్ కనెక్షన్ తీసుకోవాల్సి వస్తోంది. మారిన పరిస్థితులలో వినియోగదారులకు నచ్చిన, పాపులర్ అయిన చానెళ్ళను పే చానెల్ స్ గా మార్చేసి వాటికి అదనపు రుసుము చెల్లిస్తూ, ఎవ్వరూ చూడని చానెళ్ళను ఉచిత చానెళ్ళుగా ప్రసారం చేస్తున్నారు. వీటన్నింటని పరిశీలించిన వినియోగదారునికిప్రయోజనం కలిగించేలా నూతన విధానాన్ని రూపొందించామని ట్రారు చెబుతోంది. దీని ప్రకారం నెలకు 130 రూపాయలు చెల్లించి (జిఎస్‌టి అదనం) వంద ఉచితఛానళ్లను చూసే అవకాశం వినియోగదారులకు లభిస్తుంది. మిగిలిన వాటికి నిర్దేశించిన మొత్తం ప్రకారం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏది ఉచిత ఛానల్‌, ఏది పేఛానల్‌ అన్నది బ్రాడ్‌కాస్టర్‌ ఇచ్చే ధృవీకరణ మేరకు ట్రారు నిర్ణయిస్తుంది. ఈ పద్ధతితో వినియోగదారుడికి ఎంపిక చేసుకునే సౌకర్యం ఉండటంతో పాటు, ఇప్పటికన్నాఖర్చు ఖచ్చితం గా తగ్గుతుంది. వందల సంఖ్యలో వున్న చానెళ్ళ మధ్య తమకు నచ్చిన చానెళ్ళను వెదుక్కోవడం కంటే తమకు నచ్చిన చాన్నెళ్ళకు మాత్రమే డబ్బు కట్టి వాటినే వీక్షించుకునే సౌలభ్యం ఇప్పుడు వినియోగదారులకు లభిస్తుంది. ఇది నాణానికి ఒక వైపు.

కేబుల్ ఆపరేటర్ల వాదన మరొక విధం గా వుంది. ట్రాఇ యొక్క సదరు నిర్ణయం వలన. కనెక్షన్లు తగ్గుతాయని ఇది కేబుల్‌ టీవీ రంగంలో ఉపాధి అవకాశాలను గణనీయంగా కుదించి వేస్తుందని, పోటీ కారణంగా క్షేత్రస్థాయిలో తాము రాయితీలు ఇచ్చినా, కంపెనీలకు మాత్రం నిర్ణయించిన ధరలను తాము చెల్లించక తప్పదన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ట్రాయ్ యొక్క తాజా ఉత్తర్వుల వలన పెయిడ్ చానెళ్ళకు తగిన రుసుము నిర్ణయంచడం లో నిర్ణయాధికారాన్ని బ్రాడ్ కాస్టర్లకే వదిలివేయడం వలన వారు తమకు నచ్చిన ధరలను నిర్ణయిస్తారని, అందువలన వినియోగదారులపై అదనపు భారం పడుతుందని, వినోదంపై జి ఎస్ టి బాదుడును ఉపసంహరించాలన్న తమ విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు అన్ని చానళ్లు ఒకే ప్యాకేజీలో తక్కువ ధరకే వచ్చేవి. ట్రాయ్‌ కొత్త నింబంధనలతో ఇక చానళ్ల ధరలు కొండెక్కనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నెలనెలా చెల్లిస్తున్న రూ.150 నుంచి రూ.200 దాదాపు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. డీటీహెచ్‌ ధరలు కూడా అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. కొత్త కేబుల్‌ విధానం ద్వారా కేబుల్‌ టీవీ కనెక్షన్‌కు ప్రీపెయిడ్‌ పద్ధతిలో ముందే చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా ప్రసారమవుతున్న చానళ్లకు మాత్రమే కేబుల్‌ టీవీ సంస్థలకు రూ.130తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా చానళ్లు చూడాలనుకుంటే అదనంగా డబ్బులు చెల్లించాలి. ప్రతి చానల్‌కు ఒక రేటు పెట్టి దానిపై కూడా జీఎస్‌టీ కట్టాల్సిన పరిస్థితి. ఈ విధంగా జీఎస్‌టీ భారం ప్రతి చానల్‌కు కట్టడం వల్ల ఎక్కువ శాతం జీఎస్‌టీ కట్టాల్సిందే. ప్రజలు వినోదం, ప్రశాంతత కోసం టీవీ చూస్తుంటారు. దీనిని కూడా కేంద్రం ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. ప్రజలకు టీవీ వినోదాన్ని దూరం చేస్తున్నాయి. ట్రాయ్‌ కొత్త నిబంధనలతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. చానళ్లకు రేటు, ప్యాకేజీలకు డబ్బులు చెల్లించే పరిస్థితులు చాలా దారుణం. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి పెంచిన ధరలు సడలించాలి అని కేబుల్ ఆపరేటర్లు నిరసన గళం వినిపిస్తున్నారు.

అయితే, ఒక్కటి మాత్రం స్పష్టం. అసలే అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలకు తాజా నిర్ణయం భారంగా మారితే, అది అసలుకే మోసంగా పరిణమిస్తుంది.

Facebook Comments

2 Comments on this Post

  1. Monetary advisors business is folks business.

    Reply
  2. And that is an funding threat value taking.

    Reply

Leave a Comment