రాఫెల్ ఒప్పందం వెనుక చేదు నిజాలు

దేశానికి స్వాత్రంత్రం సిద్ధించిన తర్వాత అతి పెద్ద కుంభకోణంగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారమని విపక్షాలు, మాజీ రక్షన సాఖ అధికారులు అభివర్ణిస్తుండడం తో దేశ ప్రజలు ఈ సందర్భం గా జరుగుతున్న పరిణామాలను చూసి ఆశ్చర్యం తో నోరెళ్ళబెడుతున్నారు. . గత యుపీఏ హయాంలో రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో నాటి ప్రధానమంత్రి డా|| మన్మోహన్‌సింగ్‌ ఖరారు చేసుకొన్న ఒక్కో యుద్ధ విమానం ధరకు మూడురెట్లు అధికంగా చెల్లించే విధంగా మోడీ సర్కారు ధరను నిర్ణయించి ఒప్పందం కుదుర్చుకోవడంతోనే రాఫెల్‌ ఒప్పందంలో పెద్ద కుంభకోణం చోటు చేసుకుందన్న విషయం ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది ఈ విషయం లో విపక్షాలు, వివిధ వర్గాలకు చెందిన మేధావులు, సుప్రీం కోర్టు లేవనెత్తిన పలు ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సరైన , సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునే ధోరణి అవలంబించడం లోనే ప్రజల అనుమానాలు బలపడుతున్నాయి. యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం లో పెద్దగా కష్టపదకుండానే రూ.30 వేల కోట్లు ధారాదత్తం చేయడానికి అంబానీకి హామీ అందిందన్న విమర్శలకు ప్రభుత్వం నుండి ఇప్పటివరకు సంతృప్తికరమైన సమాధానం లేదు.

యుపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా భారతీయ వైమానిక దళం 126 రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని ఎంచుకుంది. మౌలిక ధర, పద్ధతులు దాదాపుగా ఖరారు చేసుకోబడ్డాయి. మన విధానాల ప్రకారం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఎయిరో నాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌) 108 యుద్ధ విమానాలు, మిగిలిన 18 విమానాలను ఫ్రాన్స్‌ రక్షణ కంపెనీ దస్సాల్ట్‌ సరఫరా చేయవలసి ఉంది. మార్చి 2015న ఒప్పందాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరిం రించగా , హెచ్‌ఏఎల్‌తో ఒప్పందం ఖరారు అంశాన్ని ఫ్రాన్స్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత ప్రధాని, అంబానీల సంయుక్త ఫ్రాన్స్ దేశపు అధికారిక ప్రకటన తర్వాత సంఘటనల స్వరూపం అకస్మాతుగా మారిపోయింది… యుపీఏ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందం రద్దయిందని పారిస్‌లో ప్రకటించారు. ఇప్పుడు భారత్‌ 26 యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తుందని, అయితే, 126 యుద్ధ విమానాలకు చెల్లించవలసి వున్న మొత్తమే చెల్లించబడుతుందని కూడా ప్రకటించారు. అన్నింటి కంటే ఆశ్చర్యకరంగా హెచ్ ఏ ఎల్ ను ఒప్పందం నుండి తొలగించి అంబానీ మానస పుత్రిక అయిన రాఫెల్ కంపెనీని ఒప్పందం లో భాగస్వామిగా హఠాత్తుగా చేర్చారు. అంటే ఇంతకుముందు అంగీకృత ధర కన్నా ఒక్కో యుద్ధ విమానానికి మూడు రెట్లు అదనంగా భారత్‌ చెల్లించాల్సి వస్తోంది. ఇంత విలువైన ప్రజా ధనాన్ని అప్పనం గా దానం హక్కు చేసే హక్కు ప్రజాధనానికి ట్రస్టీగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారన్న విపక్షాల, ఆర్ధిక మేధావుల ప్రశ్నలకు ,ప్రభుత్వం వద్ద లేకపోవడం అత్యంత ఆశ్చర్యకరం. ఒప్పందం ప్రకటించడానికి కేవలం పక్షం రోజుల ముందే ఏర్పాటు చేసిన కంపెనీనే భారత్‌ భాగస్వామిగా ఎందుకు ఎంచుకున్నారన్న దానిపై ప్రభుత్వం ఇప్పటివరకు వివరణ యివ్వ లేదు ప్రభుత్వం యొక్క మౌనం, ఒక దానికి ,మరొకదానికి సంబంధం లేని వివరణలు ఈ అంశం పై వచ్చే పలు ఆరోపణలకు ఊతం ఇస్తోంది.. మొత్తం ఒప్పందం విలువ రూ.60 వేల కోట్లు కాగా అందులో సగం రూ.30 వేల కోట్లు అంబానీకి చెల్లించేందుకు ఫ్రాన్స్‌ కంపెనీ వాగ్దానం చేసింది.

రాఫెల్‌ ఒప్పందం ప్రకటించిన నాటి నుండి పలువురు వ్యక్తులు, ప్రజాప్రయోజన లిటిగెంట్లు ప్రశ్నలను లేవనెత్తారు. ఇరువురు కేంద్ర మాజీ మంత్రులు, ఒక ప్రముఖ న్యాయవాది రాఫెల్‌ ఒప్పందంపై నిస్పాక్షిక విచారణ జరపాలని సీబీఐని ఆశ్రయించారు. ఇప్పుడు మొత్తం సి బి ఐ వ్యవథే గందరగోళం లో పడడంతో ఈ మొత్తం వ్యవహారం లో నిష్పాక్షిక దర్యాప్తు జరిగే అవకాశాలు తక్కువగా వున్నాయి. అయితే ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో వున్నందున ఏనాటికైనా వాస్తవాలు బయటపడతాయన్న నమ్మకం ప్రజలకు వుంది. సుప్రీం కోర్టు కూడా స్వతంత్ర భారతం లో అతి పెద్ద కుంభకోణంగా వ్యవహరించబడుతున్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం లో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. ..మొత్తం రాఫెల్‌ వ్యవహారంలో రక్షణ నిపుణులతో కలిపి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించి, నిజాలను నిగ్గు తేల్చాలి.

Facebook Comments

Leave a Comment