పత్రికా రంగంపై ప్రభుత్వ ఆంక్షలు తగవు..

మన దేశం లో అభిప్రాయాన్ని స్వేచ్చగా వెల్లడించే హక్కును మన రాజ్యంగం కల్పించింది. అభూత కల్పనలు, ఇతరుల వ్యక్తిత్వం పై ఎలాంటి ఆధారాలు లేకుండా బురద జల్లడం, అనవసర ఆరోపణలు చేయడం తప్పితే తమ అభిప్రాయాలను నిర్ద్విందంగా , నిష్పాక్షికంగా ఏ పౌరుడైనా వెల్లడి చెసుకోవచ్చు. అటువంటి పాత్రను నేడు మన వార్తా పత్రికలు సమర్ధవంతంగా పోషిస్తున్నాయనడం లో కించిత్తైనా సందేహం లేదు. ఎటువంటి ప్రలోభాలాకు లొంగని వార్తా మాధ్యమాలు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతో తోడ్పాటునిస్తాయి.

ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టి , అందులోని నిజా నిజాలను నిర్భయం గా ప్రజలకు తెలిసేలా చేయడం లో నేడు మన పత్రికలు పోషిస్తున్న పాత్ర మరువలేనిది.అందుకే ప్రసార మాధ్యమాలను ప్రజాస్వామ్యానికి నాలుగవ స్థంభంగా అభివర్ణిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పైత్రికలు, మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడదం కొన్ని పార్టీలకు ఒక అలవాటుగా మారింది. గతం లో ఎన్నో పత్రికలపి దొంగ కేసులు పెట్టడం, ఆధికం గా నష్టం కలిగేలా చర్యలు చేపట్టడం తో పాటు సంపాదకులు, రిపోర్టర్లపై వేధింపు చర్యలకు తెగబడిన సంధర్భాలు కోకొల్లలు. ! 1975 అత్యవసర పరిస్థితి రోజుల్లోనూ కాంగ్రెస్‌ ఈ విధమైన నియంతృత్వ ధోరణులనేఅవలంభించింది. ఆ సంవత్సరం జూన్‌ 25న అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా ఉండేందుకు, అర్ధరాత్రి వేళ ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’పత్రికకు కరెంటు కనెక్షన్‌ తీసేశారు. ఒక రాష్ట్రం లో తమ ప్రభుత్వం పై వ్యతిరేక వార్తలు రాస్తున్న ఒక పత్రికపై, ఒక టి వి చానెల్ పై మూడు నెలల పాటుఅధికారికం బ్యాన్ ను అమలు చేసినప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజానికి కళ్ళు చెవులు గా పని చేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సమాచార మాధ్యమాలపై ఈ విధమైన కక్ష సాధింపు ధోరణి తగదని ఆ రాష్ట్ర హైకోర్టు స్వయంగా ప్రకటించింది. ఏ వ్యవస్థలో వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా స్వేచ్చగా, రాజ్యంగానికి లోబడి పనిచెస్తుందో ఆ వ్యవస్థలో ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ద్ధిల్లుతుందనెదిజగమెరిగిన సత్యం. తాజాగా త్రిపురలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ‘డైలీ దేశర్‌ కథా’ వార్తా పత్రిక ప్రచురణ నిలిపి వేయించడం, ఆ సంపాదకుడిని రాజ్యాంగ ఉల్లంఘన కింద అరెస్టు చేయడం , ఆ పత్రికా ఆఫీసుకు విద్యుత్ సరఫరా నిలుపు చేయడం ఆ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ఆ పత్రికలో పని చెస్తున్న ఇద్దరు సీనియర్ జర్నలిస్టులను సినిమా శైలిలో గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా గాయపరచడం పట్టపగలే ఆ రాష్ట్రం లో ప్రజాస్వామ్యం ఖూని జరిగిందనదానికి నిదర్శనం.1867 సంవత్సరపు వార్తా పత్రికలు, పుస్తకాల ప్రచురణ చట్టంలో అభిప్రాయాలు వెల్లడించే విషయంలో, పూర్తి స్వాతంత్య్రం గురించి స్పష్టంగానే వుంది. వార్తా పత్రిక ముద్రణ, సంపాదకులు గురించి తప్పుగా ముద్రిస్తే, మహా అయితే జరిమానా విధించవచ్చు. అంతేకానీ ప్రచురణ మూసి వేసే అవకాశం లేదు. కానీ బిజెపి కూటమి ప్రభుత్వం జిల్లా మెజిస్ట్రేట్‌ ద్వారా పత్రిక ప్రచురణ మూయించేసి నిరంకుశ చర్యలకు పాల్పడింది. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకడం ఎంతో అవసరం.

Facebook Comments

Leave a Comment