పారిస్ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న ప్రపంచ దేశాలు..

Image Source: IndiaCelebrating.com

2015 వ సంవత్సరం లో 134 దేశాల కూటమి పారిస్ ఒప్పందం పేరిట ప్రపంచాన్ని కబళిస్తున్న పర్యావరణ కాలుష్యానికి చెక్ పెట్టాలని ఒక ఒప్పందానికి వచ్చాయి. పారిశ్రామీకరణ విశృంఖలం గా ఊపందుకున్న కాలం నాటికి ముందుతో పోలిస్తే ఆ శతాబ్దం అంతానికి భూతాపం లో పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలని ఈ పారిస్ ఒప్పందం లో లక్ష్యం గా నిర్దేశించుకున్నారు. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2050 సంవత్సరం నాటికి వాతావరణం లోనికి కార్బన్ మోనాక్సయిడ్, కార్బన్ డయాక్స్యయిడ్ , మీథేన్, ఈథేన్ వంటి బొగ్గు పులుసు వాయువులను సున్నా శాతానికి తగ్గించడం అవశ్యం.

పారిస్ ఒప్పందం తర్వాత అగ్రరాజ్యం అమెరికా , ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, గ్రేట్ బ్రిటన్ వంటి దేశాలు ఈ ప్రక్రియలో లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టాల్సివున్నందున దాని అమలులో మందగమనం పాటిస్తూ సంకుచిత ధోరణులు అవలంబించదం ప్రారంభించాయి. అమెరికా ఫస్ట్ అంటూ ఒక నినాదాన్ని ఘనం గా తలకెత్తుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచ వాతావరణాన్ని కాలుష్యం చేయడం లో అమెరికా పాత్ర అసలు లేనందున పారిస్ ఒప్పందానికి కట్టుబడి వుండాల్సిన అవసరం లేదంటూ ఏకపక్షం గా ఒప్పందం నుండి వైదొలుగుతున్నానని ప్రకటించాడు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందనట్లు ఈ ఒప్పందం నుండి తన మిత్ర దేశాలను కూడా వైదొలిగేలా తన వంతు ప్రయత్నాలు ముమ్మురం చెసాడు. అమెరికా యొక్క ఈ స్వార్ధపూరిత,నిరంకుశత్వ,ఏకపక్ష సంకుచిత విధానాల వలన పారిస్ ఒప్పందం అమలు బాధ్యత ఇప్పుడు భారత్ వంటి వర్ధమాన దేశాలపై పడింది. ఇంత భారాన్ని తలకెత్తుకోవడం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దెసాలకు దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. బొగ్గుపులుసు వాయువుల నిరోధం తో పాటు పలు వాతావరణ కాలుష్య నిరోధక చర్యలను మరింత క్రియాశీలకం గా పట్టాలకెక్కించాలన్న పారిస్ ఒప్పందం అమలు అసలుకే ప్రమాదం లో పడింది. నిజానికి పారిస్ ఒప్పందం తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భూతాపం యొక్క పెరుగుదలను రెండు డిగ్రీలకు కాకుండా ఒకటిన్నర డిగ్రీలకే పరిమితం చేసేలా కూటమి దేశాలన్నీ చురుకుగా చర్యలు చెపట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు సంపన్న దేశాల యొక్క సంకుచిత వైఖరి కారణం గా మొదటికే మోసం వచ్చింది.ఇప్పటి పరిస్థితుల బట్టి ఒబామా లక్ష్యీన్ని సాధించదం దాదాపు అసాధ్యమేనని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పారిస్ ఒప్పందం అనుకున్న కార్యాచరణ, సమయ పాలన అనుగుణం గా సాగకపోతే భూతాపం రెండు డిగ్రీలకు కాక మూడు డిగ్రీలవరకూ పెరిగే ప్రమాదం వుంది. ఇటువంటి పరిస్థితులలో ప్రపంచ మానవళి జీవన గతులు మరింత దుర్భరమవడం ఖాయం.పారిస్ ఒప్పందం లో నిర్దేశించిన లఖ్స్యం కంటే అర డిగ్రీ ఎక్కువైనా ప్రపంచం ఉష్ణతాపంలో మాడిమసైపోతుంది. పంటల దిగుబడిలో క్షీణత మొదలుకావడం, మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాలను తరచుగా వచ్చే వరదలు, ఉప్పెనలు ముంచేయడం, కేన్సర్,మూత్ర పిండాల వ్యాధి, శ్వాస కోశ వ్యాధులు పెచ్చుపెరుగుతాయి. జీవితం నిత్యం వ్యాధులమయమై దిన దిన గండం నూరేళ్ళ ఆయుషుగా మారిపోతుంది. ఇప్పటివరకు మానవళి, క్రిమి కీటకాలు, జీవ జంతుజాలం పాలిటి స్వర్గ ధామం గా భాసిలుతున్న ఈ భూమి ఇకపై అగ్నిగుండంగా మారి నరకాన్ని తలపిస్తుంది.

పారిస్ ఒప్పందం లో హరిత పర్యావరణ నిధి పేరిట జిడిపీలో రెండు శాతం నిధులు కేటాయించాలన్న పారిస్ ఒప్పందం లోని ఒక అంశాన్ని ఇప్పటివరకు భారత్ తో సహా ఏ ఒక్క దేశం అమలుచేయలేదంటే ఈ ఒప్పందం అమలుపై ప్రపంచ దేశాలకు ఎలంతి చిత్తశుద్ధి వుందోఒ అర్ధమౌతోంది. విశ్వవ్యాప్తం గా వార్షిక కార్బన ఉద్గారాలలో 40 శాతం వాటా కలిగిన అమెరికా చైనాలలో పెద్దన్న అయిన అమెరికా ఏకం గా చేతులు దులుపుకొని వెళిపోగా చైనా మాత్రం తన జిడిపిలో 0.3 శాతం నిధులు కేటాయీంచి పర్యావరణ పరిరక్షణ ప్రణాళికను కొంతమేరకైనా అమలు చేస్తోంది. భారత ప్రభుత్వం మాత్రం ప్రకటనల ఆర్భాటానికే పరిమితమై ఈ విషయం లో నత్తనడక నడుస్తుండడం ఆందోళన కలిగించే అంశం.భూమండలం పట్ల ఇప్పటి ప్రపంచ దేశాల నిర్లిప్త, నిర్లక్ష్య వైఖరి ఇలాగే కొనసాగితే వచ్చే 600 సంవత్సరాలలో యావత్ పశు, పక్ష్య, మానవజాతి తుడుచుపెట్టుకుపోతుందని విశ్వ విఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ యొక్క హెచ్చరిక యావత్ ప్రపంచ దేశాలకు కనువిప్పు కావాలి.

Facebook Comments

Leave a Comment