రూపాయి పతనం తో దేశ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం

ప్రపంచ దేశాలతో సమానంగా అభివృద్ధి సాధిస్తూ ప్రపంచం లో ఆరవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటున్న భారత దెశానికి గత డబ్భై ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి రూపాయి విలువ దిగజారిపోవడం పెద్ద ఎదురు దెబ్బ.స్వతంత్ర భారతం లో 19 47 వ సంవత్సరం లో మన రుపాయి విలువ డాలర్ తో సమానం. అయితే 2018 నాటికి రూపాయి విలువ డబ్భయో వంతుకు పడిపోయి మన ఆర్ధిక వ్యవస్థ ఎంతటి బలహీన పునాదులపై నిర్మింపబడిందో స్పష్టం చేస్తోంది.అమెరికా, టర్కీల మధ్య తాజాగా తలెత్తిన వివాదాల కారణం గా టర్కీ కరెన్సీ అయిన లిరా అంతర్జాతీయ మార్కెట్ లో తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవడం ఒక బలమైన కారణమని ఆర్ధిక నిపుణులు చెబుతున్నప్పటికీ గత 70 సంవత్సరాల కాలం లో రూపాయి విలువ కొన్ని సంధర్భాలతో తప్పితే పడిపోతూ వస్తొందే తప్ప ఏనడూ పుంజుకున్న దాఖలాలు లేవు.గత ఏదాది అక్టోబరులో అమెరికన్ డాలర్ కు మారకం విలువ 61.50 రూపాయలుగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 63.33 రూపాయలుగా వుంది. అప్పటి నుండి క్రమక్రమమంగా పెరుగుతోందే తప్ప మారకం విలువ తగ్గిన సంధర్భాలు బహు స్వల్పం. కొన్ని రోజులు పైసల్లో తగ్గినా మళ్లీ పెరగడమే కానీ దిగువకు వచ్చింది లేదు.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సరళీకరన ,ప్రపంచీకరణ విధానాలు అమలు లోనికి వచ్చాక డాలర్ యొక్క మారకం ధరను ముఖ్యం గా చమురు ధరలు ప్రభావితం చేస్తున్నాయి. . భారత చమురు వినియోగంలో దేశీయ ఉత్పత్తి కేవలం 20 శాతమేకాగా 80 శాతం దిగుమతయ్యేదే. కాబట్టి డాలర్‌తో రూపాయి మారక ఒడుదొడుకులు పెట్రోల్‌, డీజిల్‌ తదితర ఉత్పత్తుల ధరలనూ తారుమారు చేస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరుగుతోంది. దానికి తోడు డాలర్‌ మారకం విలువ కూడా పెరగడం మన ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనబరుస్తోంది.గత ఆగష్టు లో జాతీయ పెట్రోలియం అధ్యయనం నివేదిక ప్రకారం ఒక బారెల్ ముడి చమురు ధర 3225 రూపాయలు కాగా ఈ ఆగష్టు లో దాని ధర 5045 రూపాయలకు పెరిగింది. మన దేశం లో పెట్రోలియం ఉత్త్పత్తుల అవసరం రోజుకు ముఫై ఏడు లక్షల బారెళ్ళు అంటే పెరిగిన చమురు బారెల్ ధర కారణం గా ఇప్పుడు ప్రతీ రోజూ 666 కొత్ల అదనం గా ఖర్చు చెయవల్సి వస్తోంది. 80 శాతం ఉత్త్పత్తులు దిగిమతులపై ఆధారపడిన కారణం గా డాలర్ మారకం పెరుగుతుంటే మన రూపాయి విలువ తగ్గిపోయి మన ప్రభుత్వం పై ఆర్ధిక భారం ఇంతకింతగా పెరిగిపోతొంది. రూపాయి మారకం విలువ పడిపోతోందని కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించడమే 2014 ఎన్నికలకు ముందు విపక్షం లో వున్న బి జె పి కి నిత్యకృత్యంగా వుండేది. అయితే, ఈ నాలుగేళ్ల పాలనలో రూపాయి విలువ పెరగలేదు సరికదా మరింత దిగజారింది.. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం నాలుగేళ్ల క్రితం అంటే 2014 ఆగస్టు 14న డాలర్‌కు 61.05 పైసలు కాగా ఈ ఏడాది అదే రోజున రూ.69.76కు దిగజారింది. ఈ నెల 10 నాటికి దేశంలో డాలర్‌ నిల్వలు 400.88 బిలి యన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇది దాదాపు తొమ్మిది నెలల కనిష్ఠం. గడిచిన నాలుగు నెలల్లో 25 బిలియన్‌ డాలర్లకు పైగా నిల్వలు తరిగిపోయాయి. ఆగస్టు 10తో ముగిసిన వారంలోనే 1.8 బిలియన్‌ డాలర్లమేర పడిపోయాయి. ఈ క్రమంలో 400 బిలియన్‌ డాలర్ల మార్కుకు దిగువన నిల్వలు చేరుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువైపోవ డంతో డాలర్లకు డిమాండ్‌ పెరుగుతున్నది. జూలైలో వాణిజ్య లోటు ఐదేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 18.02 బిలియన్‌ డాలర్లకు చేరినది విదితమే. ఈ క్రమంలో రూపాయి కంటే వాణిజ్య లోటే ఇప్పుడు ప్రమాదమని ఆర్ధిక నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. నయా ఉదారవాద విధానాలకు భిన్నమైన ఆర్థిక విధానాలు వస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. అన్న ప్రముఖ ఆర్ధిక నిపుణుడు , నొబెల్ ప్రైజ్ గ్రహీత అమార్త్య సేన్ సిద్ధంతం పై ప్రభుత్వం కొంచెం దృష్టి సారించాలి. లీరా సంక్షోభం సాకుగా తీసుకొని వదిలేయకుండా ఆర్ బి ఐ అత్యవసరం గా రంగం లోనికి దిగి రూపాయిని నిలబెట్టడం తక్షణ చర్యలు తీసుకోవాలి.ఇప్పటికే అమెరికా, చైనాలు తమ దేశం లోకి వచ్చే దిగుమతులపై భారీగా సూంకాలు విధించడం వలన ఎగుమతులు మనకు లాభసాటి అవుతాయి. అట్లే ఇష్టారాజ్యం గా చెసే దిగుమతుల విధానాన్ని సమీక్షించి అవి మనకు మరింత భారం అవుతాయి కాబట్టి దిగుమతులపై నియంత్రణ విధించదం ఎంతో అవసరం. ముఖ్యంగా మన ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న సంప్రదాయ ఇంధన వనరుల స్థానం లో సంప్రదాయేతర ఇంధనాల వినియోగం పెంచి పెట్రోలియం ఉత్ప్పత్తులకు దిగుమతులపై ఆధారపడకుండ ప్రభుత్వం ఒక కట్టుదిట్టమైన ప్రణాళికను అమలుపరచాలి. డాలర్లు మన దేశం నుంచి తరలి పోకుండా పరిమితం చేయడానికి విలాస వస్తువుల విచ్చలవిడి దిగుమతులపై ఆంక్షలు విధించడం అవసరం. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం, టర్కీ ఆర్థిక సంక్షోభం నడుమ తీవ్ర ఒడిదుడుకులకు లోనైన ప్రపంచ ఫారెక్స్‌ మార్కెట్‌ ఇప్పుడు కుదుటపడుతోందని , మెజారిటీ ఆసియా మార్కెట్లు కోలుకుంటుండటంతో రూపాయి విలువ కూడా క్రమేణా బలపడుతున్నదని ఎపిక్‌ రిసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ ఇటీవల ప్రకటించడం కాస్తంత ఉపశమనం కలిగించే అంశం.. ద్రవ్యోల్బణం భయాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చితి రూపాయి విలువను దిగజారుస్తుండగా, ఇక ప్రతికూల పరిస్థితులు తగ్గుముఖం పట్టగలవన్న ఆశాభావం ఇప్పుడు మన ఆర్ధిక నిపుణులలో నెలకొంటుండడం శుభపరిణామం.ప్రపంచీకరణ విధానాల దుష్పరిణామాలు 2008 ఆర్థిక సంక్షోభం నాటినుండి ఒక్కొక్కటే అనుభవం లోకి వస్తున్నాయి.

ఇప్పటికైనా ప్రభుత్వం అమితంగా ప్రపంచీకరణ విధానలపై ఆధారపడకుండా, పున: సమీక్షించాలి. ప్రపంచం లే మన కంటే జనాభాలో , జిడి పి లో చిన్న దేశాలైన ఇటలీ, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు పూర్తిగా ప్రపంచీకరణపై కాకుండా స్వావలంబన, ప్రజల కొనుగోలు శక్తి పెంచేలా ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్నాయి. విదేశీ కంపెనీల , సంస్థల, వాటి ఉత్త్పత్తులపై కాకుండా స్వదేశం లో, మేకిన్ ఇండియా ప్రాతిపదికపై స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి మన దేశం లో , మన వనరులను ఉపయోగించి తయారు చేసుకునేలా చర్యలు చేపట్టాలి.

Facebook Comments