-
కార్టూన్ అఫ్ ది డే - 2 days ago
-
కార్టూన్ అఫ్ ది డే - February 20, 2019
-
కార్టూన్ అఫ్ ది డే - February 19, 2019
-
దేశం లో పేదలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్ష - February 18, 2019
-
కార్టూన్ అఫ్ ది డే - February 18, 2019
-
రాష్ట్రాలను హడలెత్తిస్తున్న స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు ప్రణాళికలు ఏవి ? - February 16, 2019
-
కార్మికులకు అందని అభివృద్ధి సంక్షేమ ఫలాలు - February 16, 2019
-
కార్టూన్ అఫ్ ది డే - February 16, 2019
-
కార్టూన్ అఫ్ ది డే - February 14, 2019
-
కార్టూన్ అఫ్ ది డే - February 13, 2019
* వరుస సునామిలతో ఇండోనేషియా ద్వీపకల్పం అతలాకుతలం.. *

Photo Courtesy: Toronto Star
ఒక ద్వీపసముదాయంగా ఉన్న ఇండోనేషియాను తరచూ భూకంపాలు వస్తుండటం బాధాకరం. 2004 నుంచి చూస్తే ఇండోనేషియాలోని ద్వీప సముదాయాల్లో తరచూ సముద్రగర్భం నుండే భూకంపాలు వస్తుండటం రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో భారీగా ప్రాణ, ఆస్తి, నష్టాలు సంభవిస్తుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా పాలూ నగరంతో పాటు సులవేశి ప్రాంతాలలో ఉవ్వెత్తున ఎగసి పడిన రాకాసి అలలు భూకంపం కూడా తోడవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. మొత్తం ఇప్పటివరకు 1250 మందికి పైగా చనిపోయారు. లెక్కకు మించిన సంఖ్యలో ఇళ్ళు నేలమట్టం అయ్యాయి.
ఈ ప్రకృతి విపత్తును అరికట్టేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికీ అమలులోకి రాలేదు. అదే విధంగా 2010లో కూడా 450 మంది తీవ్రస్థాయి భూకంపానికి బలైపోయారు. సుమత్రాలోని కోస్తాతీరం వెంబడి నెలకొన్న ఈ భూకంప తాకిడికి వేలాది ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. జావా ద్వీపంలో ఏర్పడిన భూప్రకంపనలకు 640 మందికి పైగా చనిపోయారు. సముద్రంలో పదికిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ఏర్పడిందని అమెరికా జియాలాజికల్ సర్వే సైతం స్పష్టం చేసింది. ఇలాంటి భూకంపాలే మరింతగా విధ్వంసాన్ని సృష్టిస్తాయని సైతం అమెరికా హెచ్చరించింది. ఈ భూకంపాల వల్ల కీలకంగా అనుసంధానమైన ఒకే ఒక్క మార్గం దెబ్బతిన్నది. కొండచరియలు విరిగిపడ్డాయి. దక్షిణ సులవేసి ప్రాదేశిక ప్రాంతం రాజధానిగా ఉన్న పాలు లో ఎయిర్ పోర్టును మూసివేసిన యంత్రాంగం సునామి మరో 24 గంటల్లో ఎప్పుడైనా రావచ్చన్న సంకేతాలు జారీచేసి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా దక్షిణ ప్రాంత ద్వీపం మకస్సార్లో కూడా పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. కాలిమనటన్, బోర్నియా ద్వీపంలో కూడా ఇదేవిధంగా భూమి ప్రకంపనలు చూస్తుంటే భూకంపాలతో ఇండోనేషియా సహజీవనం చేస్తోందా? అన్నట్లు ఉన్నది అక్కడి పరిస్థితి చూస్తుంటే.. పాలు నగరంలో తాజాగా ఏర్పడిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతను నమోదు చేసింది. అంటే వేలాది ఇళ్ళు నేలమట్టం అయ్యాయనే చెప్పాలి. అంతకు ముందు జూలై, ఆగష్టు నెలల్లో కూడా లాంబాక్ ప్రాంతంలో ఇదే తీవ్రతతో కూడిన భూకంపం చోటుచేసుకుంది. అగ్నిపర్వతాల నుండి వెలువడే లావాలు ఓ పక్క, మరో పక్క భూగర్భంలోని పొరల రాపిడికి వెల్లువెత్తిన తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల ప్రకంపనలకు మరో ప్రక్క ఇండోనేషియాలో తరచూ వేలాది మంది అమాయక ప్రజలను ఈ భూకంపాలు బలిగొంటున్నాయి. భూకంపం కేంద్రీకృతమైన డొంగ్గల్లా, మాముజు పట్టణాలు కూడా సునామికి గురయ్యాయి. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా పాడవడంతో సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి వీలుకలగడం లేదు. అక్కడి నుండి ఎటువంటి సమాచారమూ అందడం లేదు.
ఇప్పటికైనా వాటి నుండి ప్రజలను కాపాడే తక్షణ కార్యాచరణ మాత్రం ఆ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఒక్కటే మార్గమని స్పష్టమవుతోంది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది.
Facebook Comments