నూతన ఆరోగ్య విధానం తో ప్రజా వైద్యానికి జవసత్వాలు

కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ళు ఊరించి చివరకు ఇటీవల విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానం ముసాయిదాలో ఎన్నో ఆరోగ్యకర విధానాలను ప్రవేశపెట్ట సంకల్పించడం ఆనందదాయకం. ఇప్పటి వరకు రోగులకు చికిత్స అందించడం లో పేద, ధనిక, కుల, మత, ప్రాంతీయ తారతమ్యాలు, వారు బాధ పదే అనారోగ్యం ఒక ముఖ్య పాత్ర వహిస్తూ వచ్చింది. ఉదాహరణకు పేద వారు అత్యవసర పరిస్థితుల్లో చికిస్త కోసం ఆసుపత్రికి వస్తే వారు వైద్య సేవలకయ్యే బిల్లు చెల్లించగలరా లేదా అన్నది ముందు నిర్ధారించి ఆ తర్వాతే ఆసుపత్రులు చికిత్సప్రారంభిస్తాయి. ఈ విషయం లో నిర్ణయం తీసుకునే లోపల ఆలశ్యమై ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం వున్నా, ఆసుపత్రులు ముందు బిల్లు సంగతే చూస్తాయి. అట్లే హెచ్ ఐ వి, క్షయ, స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధుల విషయం లో కొన్ని ఆసుపత్రులు చికిత్సను నిర్వింద్వంగా తిరస్కరిస్తున్నాయి. అట్లే రోడ్డు ప్రమాదాలలో క్షతుగాత్రులైన వారికి, అట్లే అగ్ని ప్రమాదాలు లేదా ఆత్మహత్యలకు పాల్పడినవారికి మరియు అత్యాచారం లేదా దాడులకు గురయినవారికి కొన్ని ఆసుపత్రులు ముందు పోలీసులకు తెలియపరచి, ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసి, ఆ ప్రతిని తీసుకువస్తే గాని చికిత్స ప్రారం భించడం లేదు. దీని వలన సంఘటన జరిగిన మొదటి రెండు గంటల సమయం ఎంతో విలువ కాబట్టి , పోలీసులు, ఎఫ్ ఐ ఆర్ లు పేరిట జరిగే కాలాపహరణం వలన వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది.

ఈ విధానాలకు తాజాగా ప్రకటించిన జాతీయ ఆరోగ్య విధానం లో ప్రభుత్వం స్వస్తి పలికింది.. ఎటువంటి పరిస్థితి లో వున్న రోగికి నాణ్యమైన చికిత్స అందించాలే తప్ప వివక్షా పూరితం గా వ్యవహరించకుడదని తాజా ముసాయిదాలోని రోగుల హక్కుల నిబంధన తెలియజేస్తోంది.ఇందుకు విరుద్ధం గా వ్యవహరించిన సందర్భం లో రోగికి ఏదైనా జరిగితే అందుకు పుర్తిగా ఆసుపత్రులనే భాద్యత చేయడం తో పాటు రాజ్యంగం ప్రసాదించిన అందరికీ స్వేచ్చగా జీవించే హక్కును కాలరాయడం హక్కు ఉల్లంఘన కింద వస్తుంది.రోడ్డు ప్రమాదాలు, గుండె పోటు, పక్షవాతం,తదితర అత్యవసర కేసులలో కేవలం డబ్బు కట్టలేదనే కారణం తో ఆసుపత్రిలో సేవలు నిరాకరించడం అతి కఠినమైన నేరమని సదరు ముసాయిదా స్పష్తీకరిస్తోంది. ఎటువంటి తారతమ్యాలు లేకుండా నాణ్యమైన, సురక్షితమైన, వైద్య సేవలందించాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది, వైదులదేనన్న నిబంధన రోగుల పాలిట సంజీననికా పౌర సమాజం అభివర్ణిస్తోంది.బిల్లు చెల్లించలేదని, వైద్యం ప్రారంభించకపోవడం లేదా మధ్యలో ఆపివేయడం,రోగిని ఆసుపత్రి నుండి బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకోవదం, మృతదేహాన్ని బంధువులకు అప్పగించకపోవడం వంటివి నిబంధనల ఉల్లంఘన కిందే వస్తాయి. తన వ్యాధి ఏమిటో, దానికి ఎలాంటి చికిత్స చేయనున్నారో లేక అందించారో అన్న వివరాలను కూడా రోగికి అర్ధమయ్యే భాషలో, విధానం లో వైద్యులు లేక ఆసుపత్రి వర్గాలు చెప్పాల్సి వుంటుంది. గతం లో సుప్రీం కోర్టు క్షతగాత్రులు ,ఇతర అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రులకు చేరే రోగులు ఏ ప్రభుత్వ లేదా ప్రైవెట్ ఆసుపత్రిలోనైనా తమకు అవసరమయ్యే చికిత్స పొందే హక్కు వుందన్న , అట్లే డబ్బుతో సంబంధం లేకుండా ప్రాధమిక అత్యవసర చికిత్సను పొందే హక్కు,అత్యవసర పరిస్థితులలో వైద్యం అందించేటప్పుడు రోగికి లేదా అతడి సహాయకులకు చికిత్సయే అయ్యే ఖర్చు మరియు సవళ్ళను ముందా వివరించాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత ముసాయిదాలో రోగుల ప్రాధమిక హక్కు కింద చేర్చడం హర్షణీయం. కెంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ ముసాయిదాలో ప్రతీ రోగికి తాను పొందిన వైద్యం యొక్క చికిత్సల ధరల సమాచారాన్ని ముందే తెలుసుకునే హక్కు వుంది.ఈ విషయం లో జాతీయ ఔషఢ ధరల నియంత్రణ మండలి యొక్క నిబంధనలను కచ్చితం గా పాటించాల్సి వుంటుంది. రోగి కోరుకున్న పరికరాలు( ఉదాహరణకు గుండెకు వేసే స్టంట్లు దేశీయవి లేదా విదేశీయమైనది), ఔషధాలను ఆసుపత్రి విధిగా సమకూర్చవలిసి వుంటుంది. అయితే అవి లభ్యం కాని సంధర్భాలలో రోగి అనుమతితో ఆసుపత్రిలో లభమైన వాటిని ఉపయోగించవచ్చు.ఔషధాలను రోగి తాను కోరుకున్న దుకాణాల నుండి కొనుగోలు చేసుకునే సౌకర్యం వుంది.చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని రోగుల అనుమతి లేకుందా వైద్యులు లేదా ఆసుపత్రులు ఎక్కదా వెల్లడించకూడదు.మహిళా రోగులకు మహిళా సహాయకుల సమక్షం లోనే పరీక్షలు, తనిఖీలు నిర్వహించ వలిసి వుంటుంది.రోగ్య్ల వ్యక్తిగత హోదాకు భంగం కలిగించే విధం గా వైద్యుడు, ఆసుపత్రి సిబంది ప్రవర్తించకుడదు. అట్లే రోగులు చికిత్స పొందుతుండే సమయం లోనే ప్రత్యామ్నాయ అభిప్రాయం కోసం మరొక వైద్య నిపుణుని సలహా తీసుకోవచ్చు. మొత్తం మీద ప్రభుత్వం ఆలస్యం గానైనా తీసుకువచ్చిన ఆరోగ్య సంస్కరణల ద్వారా ఏకపక్ష, వ్యాపారాత్మక ధోరణులకు పాల్పడుతున్న ఆసుపత్రులకు కళ్ళెం వేస్తుందన్న ధృఢ అభిప్రాయం ప్రజలలో కలుగుతోంది. యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐ రాస వంటి సంస్థల తీవ్ర విమర్శల నేపధ్యం లో మేలుకున్న ప్రభుత్వం 2019 మార్చి కల్లా ఆయుష్మాన్ భవ పధకాన్ని ప్రారంభిస్తునట్లు ప్రకటించడం మెరుగైన ప్రాజారోగ్య పరిరక్షణలో తొలి అడుగుగా భావించాలి. ఇందులో భాగంగా ఆరోగ్య పరిరక్షణకు కనీసం 2.5 శాతం నిధులు వచ్చే బడ్ఝెట్లో కేటాయించాలి. ప్రభుత్వ ఆసుపత్రులకు జవ సత్వాలు కల్పించడం , వైద్య విద్యారంగాన్ని మరింత విస్తరించి , మెరుగైన పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం, అయుర్వేదం, యునాని, హోమియోపతి వంటి వైద్యాలకు ప్రభుత్వ పరం గా చేయూత నివ్వడం, మేలిమి వైద్య సేవలకు ఉతం ఇచ్చే విధం గా జాతీయా స్వస్థ వ్యూహాన్ని అన్ని స్థాయిలలో పకడ్భందీగా అమలుపరచడం వంటి చర్యలను తక్షణం చేపట్టాలి.

మెడికల్ ఇన్సురెన్స్ కంపెనీలకు కోట్లాది రూపాయలు వివిధ ఆరోగ్య భీమా పధకాల నిమితం చెల్లించే కంటే ఆ నిధులతో దేశం లో వున్న ముప్ఫై వేల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను, లక్షన్నర ఉప కెంద్రాల అభివృద్ధి, నిర్వహణ కోసం ఖర్చు చేయగలిగితే కోట్లాది భారతీయులకు ఎంతో మేలు కలుగుతుంది. చిన్నపాటి రొగాలను బూతద్దం లో చూపెట్టి, రోగులను భయభ్రాంతులను చేసి వారిని, వారిని నాణ్యమైన వైద్యం పేరిట పీల్చి పిప్పి చేసే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల బారి నుండి వారిని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

Facebook Comments

Leave a Comment