పౌర సేవల లభ్యతలో దేశం వెనుకబాటు

ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా విధాన సభ, లోక సభ ప్రతినిధులను, పరోక్ష ఎన్నికల ద్వారా విధాన పరిషత్, రాజ్య సభ ప్రతినిధులను ఎన్నుకొనే విధానం మన రాజ్యాంగం వీలు కల్పించింది. చట్ట సభలలో ప్రజా ప్రతినిధులు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపైనే కాకుండా,స్థానిక ప్రజల సమస్యలను చర్చించి తదనుగుణం గా బిల్లులు, చట్టాలు రూపందించడం జరుగుతుంది. ఈ చట్టాలు కార్య నిర్వాహక వ్యవస్థకు అందజేసి క్షేత్ర స్థాయిలో అవి సక్రమంగా అమలు చేసే బాధ్యతను అప్పజెప్పుతాయి. ఈ చట్టాలకు లోబడి, ప్రజలకు సంక్షేమం కోసం అవసరమైన పధకాలను రూపొందించి, వాటిని సరిగ్గా అమలు జరిగేలా చూడాసిన బృహత్తర బాధ్యత ప్రభుత్వం యంత్రాంగం పై మన రాజ్యాంగం వుంచింది.

కార్య నిర్వాహక వ్యవస్థలో భాగమైన ప్రభుత్వ యంత్రాంగం నిర్ధిష్ట వ్యవధిలో ఈ పధకాలు అమలుచేసి,తుదు ఫలితాలు ప్రజలకు అందేలా చూడాలి. ప్రజలకు పౌరసేవలు సక్రమం గా లభ్యం అయినప్పుడే మన ప్రభుత్వం నిర్దేశించిన మూడెంచల పాలనా వ్యవస్థ సక్రమం గా పని చేస్తునట్లు లెక్ఖ. ఇందుకోసం మూఎంచల వ్యవస్థలో భాగం గా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసారు. ప్రతీ స్థాయిలో సేవలు పారదర్శకంగా, అవినీతి రహితం గా, నిర్ధిష్ట సమయం లో అందెందుకు మన ప్రభుత్వం సిటిజన్ చార్టర్ను పరిపాలనా వ్యవస్థలో భాగం గా 1960 వ దశకం లోనే తయారు చేసి, అది సక్రమం గా అమలు చేయాలని స్థానిక సంస్థలను నిర్దేశించింది. దీని ప్రకారం కుల ధృవీకరణ పత్రం, స్థానికత ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, పన్నులు , సేవా రుసుములు, జనన , మరణ రిజిస్ట్రేషన్ పత్రాలు, పించను మంజూరు, దివ్యాంగుల ధృవీకరణ,భూముల పట్టా పుస్తకాలు, భూముల సర్వే, వివిధ ప్రభుత్వ పధకాలకు నమోదు. ఓటరు నమోదు ఇత్యాది పౌరసేవలను సంబంధిక కార్యాలయాలలో నిర్ణీత వ్యవధిలో పౌరులకు అందించాల్సి వుంటుంది. శాంతి భద్రతలను పరరిక్షించే పోలీసు వ్యవస్థలో కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు. కేసు దర్యాప్తు, పోస్ట్ మార్టం , కేసు ప్రగతిని తెలియజేయడం, పాస్ పోర్టు విచారణ, వ్యక్తిత్వ ధృవీకరణ వంటి అంశాలను పౌర సేవల పరిధిలో చేర్చారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలను కుడా ప్రభుత్వ పౌర సేవల నిబంధనావళిలో పొందుపరిచేరు. అయితే దేశం లో అవినీతి ఊడలు విప్పుకొని విస్తరిస్తూ విజృంభించిన తర్వాత ఈ నియమ నిబంధనలకు నీళ్ళొదలడం ప్రారంభం అయ్యింది. దళారుల వ్యవస్థ వేళ్ళూనుకొని, ప్రజలకు, ప్రభుత్వాధికారుల మద్య వారధిగా నిలబడి, ప్రతీ పనికి ఇంత రేటు కట్టి , ప్రజలు ముడుపులు చెల్లించుకుంటేనే గాని ఫైళ్ళు తత్సంబంధిత అధికారుల టేబుళ్ళ నుండి కదలని పరిస్థితి నెలకొంది. పౌర సేవలను ప్రజల ముంగిట సకాలం లో చేరేటట్లు చూడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిస్తేజం గా ప్రేక్షక పాత్ర వహిస్తొంది. ఫలితంగా ప్రజలు తమ న్యాయపరమైన సేవలకు పరిపాలనా విభాగాల చూట్టూ కాళ్ళరిగేలా ప్రదిక్షణలు చేయవల్సివస్తొంది. ప్రతీ సేవ కొంత నిర్ధిష్ట గడువులో అందించాల్సి వుండగా, ఆ గడువుకు పది రెట్లు కాలాపహరణం జరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. పౌర సేవల నిబంధనావళి ప్రకారం గడువు ముగిసినా, సంబంధిత సేవలు అందకపోతే, పై అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అయితే 90 శాతం ప్రభుత్వ పరిపాలనా విభాగాలలో ఫిర్యాదులు రాత పూర్వకం గా తీసుకునే వ్యవస్థ లేదు. పైగా అనధికారం గా ఫిర్యాదు ఇచ్చినా, ఇచ్చిన వారిపై అధికారులు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం ప్రజల పాలిట సాపం గా మారింది. పరిస్థితిని చక్కదిద్దెందుకు 2012 లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌర సేవల బిల్లు తిసుకురావాలని సంకల్పించింది. అయిదుగురు నిపుణులతో కుడిన బృందం ముసాయిదా బిల్లును తయారు చెసినా, తర్వాత ఎలంటి పురోగతి లేదు.ఇందులో భాగం గా ప్రతిప్రభుత్వ కార్యాలయం ఉందు తాము అందించే సేవల పట్టికను అందుబటులో వుంచదం, సిటిజన్ చార్టర్లను ప్రభుత్వ వెబ్ సైట్లలో వుంచడం, ప్రతీ పనికి నిర్ణీత గడువు, చెల్లించాల్సిన రుసుము వివరాలతొ పటు ఆ గడువులో పని పూర్తికాకపోతే, ఆలశ్యం అయిన ప్రతీ రోజుకు మూడు వందల రూపాయలు ధరకాస్తుదారులకు చెల్లించడం, ఎలక్త్రానిక్ సేవలను కుడా పౌర సేవలలో అనుసంధనం చేయడం వంటి అంశాలను ముసాయిదా బిల్లులో పొందు పరచారు.

అన్నాహజారే జన లోక్ పాల్ బిల్లు కోసం ఆందోళన చెసిన నేపధ్యం లో కేంద్ర ప్రభుత్వం సిటిజెన్ చార్టర్ అండ్ ఫిర్యాదు /పరిహారం 2011 బిల్లు ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టి అమోదింపజేసింది. సదరు బిల్లు ద్వారా ప్రతి పౌరుడికి నిర్దిష్ట వస్తువులు మరియు సేవల యొక్క సమయ-సరిహద్దు పంపిణీకి హక్కును ఇవ్వడానికి మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక యంత్రాంగం అందించడానికి ప్రయత్నిస్తుంది. చట్టం అమలులో ఆరు నెలల వ్యవధిలో పౌరసత్వ చార్టర్ను ప్రచురించడానికి ప్రతి పబ్లిక్ అధికారం కోసం బిల్లు తప్పనిసరి చేస్తుంది, ఆ అధికారి సంబంధిత చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది, దీనితో రూ. 50,000 తన జీతం మరియు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవలిసి వుంటుంది. అయితే ఈ బిల్లు కూడా ఏనాడూ కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వోద్యోగుల ఒత్తిడి కారణం గానే ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లును బుట్టదాఖలు చేసిందనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు పౌర సేవల చట్టం రూపకల్పనను ఒక వ్యక్తిగత విషయం గా కాకుండా మెరుగైన వ్యవస్థ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నం గా భావించి తమ వంతు తోడ్పటు అందించాలి. ప్రభుత్వం ప్రజల కోసం ఎన్ని పధకాలు ప్రవేశపెట్టినా,అంతిమం గా ప్రజలు ధీమాగా, ధైర్యం గా ప్రభుత్వ కార్యాలయాల లోనికి వెళ్ళి, అవినీతి, అక్రమాలు, వేధింపులకు ఆస్కారం లేకుండా న్యాయపరమైన సేవలను పొందలేకపోతే అది ఒక వృధా ప్రయాస అని భావించాలి. అందుకే ప్రజలందరికీ ఎలాంటి తారతమ్య బేధాలు లేకుండా మెరుగైన ప్రభుత్వ సేవలు లభించేందుకు పౌర సేవల చట్టం తీసుకురావడం ఎంతో అవసరం.

సి ప్రతాప్

Facebook Comments

Leave a Comment